Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఇక స్కూల్‌ బ్యాగ్‌ తేలికే

  • ఇక స్కూల్‌ బ్యాగ్‌ తేలికే 
  • గరిష్ఠ బరువు 4.732 కిలోలు
  • 1, 2 తరగతులకు హోంవర్క్‌ లేదు
  • సబ్జెక్టుల వారీగానే పుస్తకాలు తేవాలి
  • అవసరం లేని పుస్తకాలు ఇంట్లోనే*
  • అమల్లోకి ‘స్కూల్‌ బ్యాగ్‌ పాలసీ-2020’

స్కూల్‌ బ్యాగుల బరువు విషయంలో పిల్లలకు ఉపశమనం కలగనుంది. ప్రతిరోజూ పుస్తకాలన్నీ మోసుకెళ్లే పద్ధతికి పాఠశాల విద్యాశాఖ స్వస్తి పలికింది. ఏరోజుకారోజు అవసరమైన పుస్తకాలను మాత్రమే విద్యార్థులు తెచ్చుకునే విధానం తెచ్చింది. ఈ మేరకు ‘స్కూల్‌ బ్యాగ్‌ పాలసీ-2020’ అమలుకు పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. జాతీయ విద్యా విధానం, మానవ వనరుల మంత్రిత్వ శాఖ సూచనలకు అనుగుణంగా పిల్లల బ్యాగ్‌ ఎంత బరువు ఉండాలనే దానిపై నిబంధనలు రూపొందించింది. తాజా నిబంధనల ప్రకారం ప్రతి స్కూలూ.. టైంటేబుల్‌ తయారుచేసుకుని, వీలైనంత మేర బ్యాగ్‌ల బరువును తగ్గించే ప్రయత్నం చేయాలి. పిల్లలకు ఎక్కువ గంటల చదువు కంటే సులభంగా నేర్చుకునేలా ‘ఎక్స్‌పీరియన్షియల్‌ లెర్నింగ్‌’ అమలుచేయాలి. 


పుస్తకాలతో అవసరం లేకుండా అందుబాటులో ఉండే మెటీరియల్‌తో ప్రాజెక్టు వర్కులు చేయించాలి. 1, 2 తరగతుల విద్యార్థులకు హోంవర్క్‌ ఇవ్వకూడదు. 3 నుంచి 5 తరగతుల పిల్లలకు నేరుగా వర్క్‌బుక్‌లోనే హోంవర్క్‌ రాసి పాఠశాలల్లోనే టీచర్లకు ఇవ్వాలి. 6 నుంచి 10 తరగతులకు కూడా ఈ విధానమే ఉండాలి. విద్యార్థులకు రోజువారీ నిర్దేశించిన సబ్జెక్టులకే హోంవర్క్‌ ఇవ్వాలి. ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు రోజూ ఒక గణితం పుస్తకం, ఇతర సబ్జెక్టుల్లో ఒక పుస్తకం తెచ్చుకునే విధానం అమలుచేయాలి. టీచర్లు ఏ సబ్జెక్టు బోధిస్తారో ముందుగానే నిర్ణయించి, ఆ రోజుకు ఆ పుస్తకాలను మాత్రమే తెచ్చే విధానం పిల్లలకు అలవాటుగా మారేలా చేయాలి. విద్యార్థులు సెమిస్టర్ల వారీగానే పుస్తకాలు తెచ్చుకోవాలి. వీలైన చోట్ల పాఠశాలల్లోనే విద్యార్థుల పుస్తకాలు ఉంచుకునేలా బాక్సులు, షెల్ఫ్‌లను ఏర్పాటు చేయలి. వీలైతే వర్క్‌బుక్‌లు, అసైన్‌మెంట్లు, డిక్షనరీలు, రిఫరెన్స్‌ పుస్తకాలు, ప్రాక్టీస్‌ మెటీరియల్‌ లాంటివి పాఠశాలల్లోనే ఉండే ఏర్పాట్లుచేయాలి. 

ఒకటి, రెండు తరగతులకు హోం వర్క్ ఇవ్వొద్దు: ఎస్సీ ఈ ఆర్టీ 

ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వొద్దని రాష్ట్ర విద్యా పరిశో ధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) ఆదేశాలు జారీ చేసింది. అలాగే 3,4,5 తరగతుల వర్క్ బుక్ లను పాఠశా లలోనే ఉంచాలని తెలిపింది. విద్యార్థుల పుస్తకాల బ్యాగు బరువు తగ్గించేందుకు ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. 6-10 విద్యార్థులకు హోం వర్క్ భారంగా మారు తోందని, ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్టుకు ఇవ్వాలని సూచిం చింది. ప్రాథమిక విద్యార్థులకు గణితానికి ఒక నోట్బుక్, మిగిలిన అన్ని సబ్జెక్టులకు కలిపి ఒక నోట్బుక్ నిర్వహిం చాలని వెల్లడించింది. ఉన్నత పాఠశాలల్లో లాంగ్నోట్ బుక్ను రెండు సబ్జెక్టులకు కేటాయించుకునేలా విద్యార్థు లకు అనుమతి ఇవ్వాలని సూచించింది. ఉపాధ్యాయులు తరగతిలో బోధించే సబ్జెక్టులను విద్యార్థులకు చెప్పి, ఆ రోజుకు అవసరమైన పుస్తకాలను మాత్రమే తీసుకువ చ్చేలా చూడాలని పేర్కొంది. పాఠ్యపుస్తకాలను సెమిస్టర్ వారీగా మాత్రమే తీసుకెళ్లేలా చూడాలని, వాటిని బడిలో భద్రపరుచుకునే సదుపాయం కల్పించాలని సూచిం చింది. 1, 2 తరగతులకు స్కూల్బ్యాగు బరువు 1.5 కిలోలు, 3-5 తరగతులకు 2.5కిలోలు, 6, 7 తరగతు కు 4 కిలోలు, 8, 9 తరగతులకు 4.5 కిలోలు, పదో తరగతికి 5 కిలోల బరువు ఉండాలని వెల్లడించింది.

No comments:

Post a Comment