24 Years స్కేల్ ( SPP II స్కేల్ ):
SGT మరియు ఉద్యోగ* *మిత్రులు అనేక మందికి*
24 Years స్కేల్ ( SPP II స్కేల్ ) పై అవగాహన లేకపోవడం వలన ఆర్థికంగా నష్టపోతున్నారు .
SGT క్యాడరులో చాలా సంవత్సరాలుగా పనిచేస్తూ ప్రమోషన్ రాని వారికి ఇచ్చే ప్రమోషన్ స్కెళ్లే అప్రయత్న పదోన్నతి స్కెళ్ళు ( Atomatic Advancement Scales ) . అవి 6/12/18/24 సంవత్సరాల స్కెళ్ళు.
ఇప్పుడు కొత్తగా 2022 PRC లో 30 సంవత్సరాల స్కెల్ కూడా వచ్చింది..
ఉపాధ్యాయ ఉద్యమం ద్వారా పోరాటం చేసి సాధించు కున్నవి.
12 సంవత్సరాల స్కెలు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కు, 24 సంవత్సరాల స్కెలు హెస్కూల్ హెడ్మాస్టర్ పోస్టు స్కెలుకు సమానం .
"SGT లు 24 సంవత్సరాల ప్రమోషన్ స్కెలు తీసుకొనపోతే" , తదుపరి రెగ్యులర్ ప్రమోషన్ వచ్చేవరకు ఆర్ధికంగా నష్టపోతారు.
SGTలు 24 సంవత్సరాల ప్రమోషన్ పోస్టు స్కెలు ( SPP II స్కేల్ ) తీసుకుంటే ఒక ఇంక్రిమెంట్, తదుపరి రెగ్యులర్ ప్రమోషన్ వస్తే ఒక ఇంక్రిమెంట్ *"మొత్తంగా ప్రమోషన్ నాటికి రెండు ఇంక్రిమెంట్స్ వస్తాయి". పైగా మొదటి ఇంక్రిమెంట్ పై డి ఎ కలుపుకుంటే ప్రమోషన్ వచ్చే వరకు ఆర్ధికంగా లాభం ఉంటుంది. ఆకాలంలో కొత్త PRC అమలైతే స్టేజి బెనిఫిట్ కూడా ఉంటుంది.
ఇక ప్రమోషన్ అర్హత ఉన్న వారు ప్రమోషన్ తిరస్కరించ రాదు కదా... (ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఒకసారి తిరస్కరించడానికి మాత్రమే ఉంది ).
అలాగే ప్రమోషన్ స్కెలు కూడా తిరస్కరించరాదు ...
24 Years స్కేల్ ( SPP II స్కేల్ ) తీసుకుంటే "ప్రామోషన్ పోస్టు స్కెలు లో 6/12 సంవత్సరాల స్కెళ్లు రావని అనుకోవద్దు" .
ఎందుకు రావో కూడా తెలుసుకోండి. SGT కు
24 Years స్కేల్ ( SPP II స్కేల్ ) 35120-87130. ఇది హైస్కూల్స్ హెడ్మాస్టర్ స్కెలు 35120-87130 కు సమానం .
ఇది స్కూల్ అసిస్టెంట్ 6 సంవత్సరాల స్కెలు (29760-80930) కంటే ఎక్కువ. స్కూల్ అసిస్టెంట్ 12 సంవత్సరాల స్కెలు (35120-87130) కు సమానం.
GO Ms. No.68 , finance, dt.12.06.2015 ప్రకారం 6/12/18/24 సంవత్సరాలు సర్వీస్ పూర్తి కాగానే ఉద్యోగికి
6/12/18/24 సంవత్సరాల స్కెళ్ళు మంజూరు చేసే బాధ్యత డ్రాయింగ్ అధికారులదే.
అప్రయత్న పదోన్నతి స్కెలు (AAS స్కెళ్ళు) మంజూరు జాప్యం అయితే ఆడిట్ అభ్యంతరాలు కూడా వచ్చుచున్నవి.
కావున SGT మరియు ఉద్యోగ మిత్రులు
24 Years స్కేల్* ( SPP II స్కేల్ ) నిబంధనలు తెలుసుకొని, ఆలోచించి అవగాహనతో సరి అయిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోండి.
No comments:
Post a Comment