జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తుల ఆహ్వానం
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా ఆర్థిక సాయం పొందుటకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కులాలకు చెం దిన విద్యార్థుల నుంచి 200 లోపు క్యూఎస్ ర్యాం కుల ప్రకారం ఏదైనా దేశంలోని యూనివర్సిటీ లలో, విద్యా సంస్థలలో పీజీ, పీహెచ్, ఎంబీబీ ఎస్ చదువుకునేందుకు దరఖాస్తులు కోరుతు న్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు కె. హర్షవర్ధన్ శనివారం తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలని, వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదని పేర్కొన్నారు. డిగ్రీ, పీజీ, ఇంటర్ కోర్సులలో 60 శాతం మార్కులు లేక తత్సమాన గ్రేడు కలిగి ఉండాలని తెలిపారు. ఎంబీబీఎస్ కోర్సులకు నీట్ పరీక్షలో అర్హత కలిగి ఉండాలన్నారు. 100 లోపు ర్యాంక్ గల విశ్వ విద్యాలయం, విద్యా సంస్థలో అడ్మిషన్ పొందితే ఫీజు మొత్తం ప్రభు త్వమే చెల్లిస్తుందని తెలిపారు. సెప్టెంబర్ 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలను జీఓ ఎంఎస్ నంబర్ 39 సోషల్ వెల్ఫేర్ (ఎడ్యుకేషన్) డిపార్ట్మెంట్ నందు పొంద వచ్చని తెలిపారు.
No comments:
Post a Comment