హైదరాబాద్, విజయవాడ సహా 75 జిల్లాలు లాక్ డౌన్.. కేంద్రం షాకింగ్ నిర్ణయం
దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ కేసులు బయటపడ్డ జిల్లాలను మార్చి 31 వరకు లాక్ డౌన్ చేయాలని ఆదేశించింది.
ఈ మేరకు ఆదివారం (మార్చి 22) ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా 75 జిల్లాల్లో మార్చి 31 వరకు జనతా కర్ఫ్యూ కొనసాగబోతోంది.
ఈ జిల్లాల్లో మార్చి 31 వరకు అత్యవసర సేవలు మినహా మిగిలినవన్నీ బంద్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం కరోనా వైరస్ కేసులు బయటపడ్డ జిల్లాలన్నీ మార్చి 31 వరకు లాక్ డౌన్ అవనున్నాయి.
వీటిలో తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలు;
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా విజయవాడలోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో బెజవాడ నగరాన్ని కూడా మార్చి 31 వరకు లాక్ డౌన్ చేసే అవకాశం ఉంది.

No comments:
Post a Comment