Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఏపీ లో కూడా మార్చి 31వరకు లాక్‌డౌన్ : సీఎం జగన్

ఏపీ లో కూడా మార్చి 31వరకు లాక్‌డౌన్ : సీఎం జగన్
 ఆంధ్రప్రదేశ్‌లో కూడా లాక్‌డౌన్ ఉంటుందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మార్చి 31 వరకు లాక్‌డౌన్ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. జనతా కర్ఫ్యూ, కరోనా పాజిటివ్ కేసుల గురించి మాట్లాడారు.
31 వరకూ ఇళ్లలోనే ఉండండి !

‘ప్రజా రవాణా జరగదు. పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు నిలిపివేస్తున్నాం. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు బంద్‌ కానున్నాయి. అత్యవసర సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. నిత్యావసర షాపులు తప్ప మిగతా దుకాణాలు బంద్‌ కానున్నాయి. గోడౌన్లు, ఫ్యాక్టరీలు తక్కువ సిబ్బందితో నడపాలి. ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలి. అంతర్రాష్ట్ర సరిహద్దుల్ని మూసివేస్తున్నాం. నిత్యవసర షాపులు తప్ప దుకాణాలు మూసివేయాలి. విదేశాల నుంచి వచ్చినవాళ్లు కచ్చితంగా 14 రోజులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి. ఈ నెల 31 వరకూ అందరూ ఇళ్లలో కూర్చోగలిగితే కరోనా వైరస్‌ను తరిమికొట్టగలం’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
➖➖➖➖➖➖➖➖➖➖➖
➧ఈనెల 29వ తేదీన ఉచితంగా బియ్యం, 1kg పప్పు, ఏప్రిల్ 4న ప్రతి కుటుంబానికి 1000రూపాయల నగదు అందజేయబోతున్నాం :ఏపీ సీఎం వైస్ జగన్
➧ఏపీలో మార్చి 31 వరకు షట్ డౌన్..
➧ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా బంద్..
➧నిత్యవసర సరుకుల దుకాణాలు తప్ప మిగిలిన షాప్ లన్నీ బంద్..
➧29 నాటికి కిలో పప్పు, ఎన్ని కిలోల రేషన్ బియ్యం ఇస్తున్నామో అంతే మొత్తంలో బియ్యం..అదనంగా ఇస్తాం..
➧ప్రతి కుటుంబానికి ఏప్రిల్ 4న వాలేంటర్ వచ్చి అందిస్తారు..
➧దీని కోసం..దాదాపు రూ.1500 కోట్ల భారం పడుతుంది..
➧దేశం మొత్తం ఒకే అడుగు వేస్తున్న పరిస్థితుల్లో మనం సహకరిద్దాం..
➧విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజులు తప్పనిసరిగా హౌస్ క్వారంటైయిన్లో ఉండాల్సిందే..
➧ధరలు పెంచితే క్రిమినల్ చర్యలు..జైలు కి పంపిస్తాం..
➧ప్రతి నిత్యవసర సరుకులు..కూరగాయల రేట్లుని కలెక్టర్లు  ప్రకటన చేస్తారు..అధిక ధరలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయాలి
➧పది మంది ఎక్కడ గుమిగూడి ఉన్నా ..వారిని కట్టడి చేయాల్సిందే..
➧రైతులు, రైతు కూలీలు.. పొలం పనులకు వెళ్ళేటప్పుడు కట్టడి చేయ వద్దు 2 మీటర్ల దూరం ఉండమని సూచించండి.
➧ఎమర్జెన్సీ సేవలు అందించే అన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయి..
➧కరోనా మరణాలు 2 శాతం కన్నా ఎక్కువ లేదు కాబట్టి భయ పడాల్సిన అవసరం లేదు..కానీ ఇది ప్రబలుతున్న వేగాన్ని చూస్తుంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోక తప్పదు..
➧యువతకి ఇది ప్రమాదం కాకపోయినా వయసులో పెద్ద వారు పానిక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..
వృద్ధులు, పిల్లలు బయటకు పోవద్దు..
రాష్ట్రంలో 6 కేస్ లు నమోదు..
➧అందులో ఒక నెల్లూరు కేస్ లో వ్యక్తికి కరోనా నయం అయిపోయి ఇంటికి కూడా పంపించడం జరిగింది.
➧రాష్ట్రంలో 24 మంది హాస్పిటల్ ఐసోలేషన్ లో ఉన్నారు.
➧ప్రతి నియోజకవర్గంలో వంద పడకల, జిల్లా కేంద్రంలో 200 పడకల ఐసోలేషన్ క్వరంటైయిన్ కేంద్రాలు రాబోయే రోజుల్లో  ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగింది.
➖➖➖➖➖➖➖➖➖➖➖

No comments:

Post a Comment