Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఏపీ లో మరో రెండు రోజులు కర్ఫ్యూ ?

ఏపీ లో మరో రెండు రోజులు కర్ఫ్యూ ?
కాసేపట్లో సీఎం జగన్‌ ప్రెస్‌మీట్

 కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో మరో రెండు కర్ఫ్యూ కొనసాగించే అవకాశంపై ఏపీ సీఎం జగన్‌ అధికారులతో సమాలోచనలు జరిపారు. జనతా కర్ఫ్యూ, కరోనా వైరస్‌ నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ సహా ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చేవారిపట్ల కేంద్రం నిర్దేశించిన నియమాలను పాటించాలని ఆదేశించాలని జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసులపై ఈ సమావేశంలో విస్తృతస్థాయిలో చర్చించారు.

కరోనా అనుమానిత కేసులకు ఐసోలేషన్‌ వార్డులు, చికిత్స సదుపాయాలు, ఔషధాలపై ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

మరోవైపు ఈ సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్‌ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన వివరించనున్నారు.

ఈ సమావేశంలోనే కర్ఫ్యూ కొనసాగింపుపై జగన్‌ ప్రకటన చేసే అవకాశముంది.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
      CORONA VIRUS - 75 జిల్లాలు లాక్ డౌన్.. కేంద్రం షాకింగ్ నిర్ణయం
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
జనతా కర్ఫ్యూ
రాత్రి 9:00వరకే కదా అని, రాత్రి 9:00 ఐన తర్వాత ఆవేశంగా..
అత్యుత్సాహంతో
ఇండియా ' వరల్డ్ కప్ గెలిచినట్లుగా అందరూ రోడ్లు మీదకు వచ్చేసి గుంపులు గుంపులుగా సంబరాలు చేసేసుకోకండి..

అది ఇంకా ప్రమాదం దయచేసి గమనించగలరు

No comments:

Post a Comment