నేటి నుంచి ఇంజనీరింగ్ ఆప్షన్లు -27-07-2019
అంతా ఆన్లైన్లోనే.. 4న సీట్ల కేటాయింపు
5 నుంచి తరగతులు.. కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఎంసెట్-ఇంజనీరింగ్ ర్యాంకర్ల నిరీక్షణకు తెరపడింది. 2019-20 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను శుక్రవారం ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. దీని ప్రకారం.. 1 నుంచి 35 వేల ర్యాంకు వరకు ఈ నెల 27-28 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 35,001 నుంచి 80 వేల ర్యాంకు వరకు 29-30 తేదీల్లో, 80,001 నుంచి చివరి ర్యాంకు వరకు ఈ నెల 31- ఆగస్టు 1 తేదీల్లో ఆప్షన్లు ఎంచుకునే అవకాశం కల్పించారు. ఆగస్టు 2న వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు వీలు కల్పించారు. 4న అభ్యర్థులకు కేటాయించిన సీట్ల వివరాలను వెబ్సైట్లో ఉంచుతారు. ఆగస్టు 5న తరగతులు ప్రారంభం కానున్నాయి.
సీటు పొందిన అభ్యర్థులు సంబంధిత కళాశాలలో రిపోర్టు చేసేందుకు ఆగస్టు 8 వరకు గడువు విధించారు. గత కొంతకాలంగా కళాశాలల ట్యూషన్ ఫీజుల విషయం సందిగ్ధంగా ఉండడంతో కౌన్సెలింగ్ ప్రక్రియలో జాప్యం జరిగింది. స్పందించిన ప్రభుత్వం గత ఏడాది అమలు చేసిన ఫీజులనే ఈ ఏడాదీ అమలు చేయాలని నిర్ణయించడంతో కౌన్సెలింగ్కు మార్గం సుగమమైంది.
అందుబాటులో 96,572 సీట్లు
ఎంసెట్-ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ కోసం కన్వీనర్ కోటా(70ు)లో రాష్ట్రంలోని 390 కాలేజీల్లో మొత్తం 96,572 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 275 ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం 93,090 సీట్లు ఉండగా, 19 యూనివర్సిటీల్లో 5,474 సీట్లు, 256 ప్రైవేట్ కాలేజీల్లో 87,616 సీట్లు ఉన్నాయి. 115 ఫార్మసీ కాలేజీల్లో మొత్తం 3,482 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 వర్సిటీల్లో 230, 107 ప్రైవేట్ కాలేజీల్లో 3,252 సీట్లు ఉన్నాయి.

No comments:
Post a Comment