గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
Apply Here
➨ One Time Profile Registration.
➨ Payments.
➨ Online Application.
___________
Notifications
___________
పూర్తి వివరాలకు క్రింది నోటిఫికేషన్లు డౌన్లోడ్ చేసుకోండి .
Grama Sachivalayam
➪ Village Revenue Officer ( Grade-II )
➪ Panchayat Secretary ( Grade - IV )
➪ Animal Husbandary Assistant
➪ Village Horticulture Assistants
➪ Village Sericulture Assistants
➪ Village Horticulture Assistants
➪ Village Surveyor ( Grade - III )
➪ Engineering Assistants ( Grade - II )
➪ Village Fisheries Assistants
➪ ANM ( Multi purpose health Assistant ( Female ) )
➪ Mahila police and Women & Child Welfare Assistant
ward Sachivalayam
➪ Ward Education & Data Processing Secretary
➪ Ward Planning and Regulation Secretary ( Grade _ II )
➩ Welfare and Education Assistant.
➪ Ward womwn & Weaker sections Protection Secretary
1,32,948 ఉద్యోగాలు
గ్రామ, వార్డు స్థాయిల్లో..
సచివాలయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఉన్నవారిని బట్టి మార్పులు
27-07-2019 నుంచి దరఖాస్తులు
జిల్లా యూనిట్‌గా డీఎస్సీ
ఆబ్జెక్టివ్ పద్ధతిలో రాతపరీక్ష
గ్రామ, పట్టణ స్థానిక సంస్థల్లో ఏర్పాటు చేయనున్న సచివాలయాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం శుక్రవారం నోటిషికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ సేవలను ప్రజలకు సమర్థవంతంగా చేరువ చేయడానికి గ్రామ సచివాలయాల్లో 95,088 మంది, పట్టణ వార్డు సచివాలయాల్లో 37,860 మంది కార్యదర్శులు అవసరమని పేర్కొంది. అంటే... మొత్తం 1,32,948 మంది అవసరం. అయితే, ఇప్పటికే ఆయా బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని మినహాయిస్తే భర్తీ చేసే సంఖ్యలో మార్పు ఉండే అవకాశముందని తెలిపింది. వీటికి శనివారం నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు పదో తేదీ వరకూ దరఖాస్తులకు గడువుంది. మరిన్ని వివరాలకు వీఎ్‌సడబ్ల్యూఎ్‌స.ఏపీ.జీవోవీ.ఇన్ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని ప్రభుత్వం సూచించింది.
గ్రామాల్లో పోస్టులు...
పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్-5) పోస్టులు-7040, వీఆర్వో(గ్రేడ్-2)-710, ఏఎన్‌ఎం(గ్రేడ్-3)-9754, పశుసంవర్థక అసిస్టెంట్-9886, గ్రామ పిషరీస్ అసిస్టెంట్-794, గ్రామ ఉద్యానవన అసిస్టెంట్-4000, గ్రామ వ్యవసాయ అసిస్టెంట్(గ్రేడ్-2)-6714, గ్రామ సెరికల్చర్ అసిస్టెంట్-400, మహిళా పోలీసు మరియు మహిళ, బాలల సంక్షేమ అసిస్టెంట్లు-11,158, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు(గ్రేడ్-2)-11,158, గ్రామ పంచాయతీ సెక్రటరీ(గ్రేడ్-6)డిజిటల్ అసిస్టెంట్లు-11,158, గ్రామ సర్వేయర్లు(గ్రేడ్-3)-11,158, సంక్షేమ మరియు విద్యా అసిస్టెంట్లు-11158 పోస్టులను భర్తీ చేసేందుకు పంచాయతీరాజ్‌శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. అవసరాన్ని బట్టి ఖాళీలు మారే అవకాశముందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ గిరిజాశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తులు ఎలా..?
సచివాలయ పోస్టులకు అభ్యర్థులు ముందుగా వారి బయోడేటా వివరాలు వన్‌టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్(ఓటీపీఆర్) చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం. సెప్టెంబరు మొదటి వారంలో పరీక్షలను ఆఫ్‌లైన్ విధానంలో చేపడతారు. ఇంగ్లీషు, తెలుగు మీడియంలో పరీక్షలుంటాయి. 2019 జూలై ఒకటో తేదీ నాటికి 18-42 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఇస్తారని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పరీక్ష ఫీజు ఉండదు. ప్రాసెసింగ్ ఫీజు రూ.200లు చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులు పరీక్ష ఫీజు రూ.200, ప్రాసెసింగ్ ఫీజు రూ.200లు చెల్లించాలి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని పలు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. దరఖాస్తుదారు ఏ జిల్లాలోనైనా పరీక్షలు రాసేందుకు ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. వెసులుబాటు బట్టి కేంద్రాలను ప్రభుత్వం కేటాయిస్తుంది. కమ్యూనిటీ, నేటివిటీ, జనన ధ్రువీకరణ పత్రం, నిరుద్యోగ డిక్లరేషన్, స్కూల్ స్టడీ సర్టిఫికెట్లు, నివాస ధ్రువీకరణ పత్రం, అంధులు, బధిరులు, వికలాంగులు, స్థానికత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.
పట్టణాల్లో ఇలా...
రాష్ట్రంలోని మొత్తం 110 పట్టణ స్థానిక సంస్థల్లో 3786 వార్డు సెక్రటేరియట్లకు కలిపి ఒక్కొక్కదానికి పదిమంది చొప్పున మొత్తం 37,860 మంది కార్యదర్శులను నియమించనున్నారు. వీరిలో ఇప్పటికే సంబంధిత బాధ్యతలు నిర్వహిస్తున్న 4,359 మంది ఉద్యోగులను మినహాయించి మిగిలిన 33,501 వార్డు సెక్రటేరియట్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎంపికైన కార్యదర్శులకు తొలి రెండేళ్లపాటు ప్రొబేషన్ పిరియడ్‌గా నెలకు రూ.15వేల కన్సాలిడేట్ వేతనం చెల్లిస్తారు. దీనిని విజయవంతంగా ముగించిన వారికి రెగ్యులర్ స్కేల్ అమలు చేస్తారు. సగటున 4వేల మందికి ఒక వార్డు సెక్రటరీ ఉంటారు.
పరీక్ష విధానం..
పరీక్షలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. పార్ట్-ఏ కింద జనరల్ స్టడీ్‌సలో 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. అందుకోసం 50 నిమిషాలు కేటాయిస్తారు. పార్ట్-బీ కింద 100 ప్రశ్నలకు 100 మార్కులుంటాయి. ఇందుకోసం 100 నిమిషాలు కేటాయిస్తారు. ఈ పరీక్షల్లో నెగటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి నాలుగు తప్పులకు ఒక మార్కు కట్ చేస్తారు. పరీక్ష అయిన తర్వాత వెబ్‌సైట్‌లో ‘కీ’ ఉంచుతారు. కీ, ఇతర విషయాలపై మూడు రోజుల్లోపు అభ్యంతరాలు తెలియచేయొచ్చు. అనంతరం నిపుణుల కమిటీ పరిశీలించి రివైజ్డ్ కీ విడుదల చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ/అటానమస్ బాడీ/ప్రభుత్వ ఎయిడెడ్ సంస్థల్లో తాత్కాలిక/పర్మినెంట్‌గా పనిచేస్తున్న సిబ్బంది ఈ పరీక్షలు రాసేముందు వారి విభాగాధిపతికి రాతపూర్వకంగా తెలియజేయాలి. రాతపరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌తోనే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కనీస అర్హత పొందాలంటే ఓసీ, బీసీలు 40 శాతం, ఎస్సీలు 35 శాతం, ఎస్టీ, దివ్యాంగులు 30 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీతో పాటు ఒక్కో అభ్యర్థి పొందిన మార్కులు పెడతారు. ప్రత్యేకంగా మార్కుల జాబితా ఇవ్వరు. ఇప్పటికే ఆయా అర్హతలు కలిగి ఉండి పనిచేస్తున్న ఎంపీఈఓ/ఎంఐఏఓ/ఫీల్డ్ కన్సల్టెంట్/కాంట్రాక్టు హార్టీకల్చర్ ఆఫీసర్లతో పాటు పలువురు సిబ్బందికి వయోపరిమితిలో సడలింపు, రాతపరీక్షల్లో గ్రేస్ మార్కులు దక్కే అవకాశముందని చెబుతున్నారు. ఏ అభ్యర్థి అయినా అర్హతలకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల పాటు ఏ పరీక్షలకు హాజరుకాకుండా డీబార్ చేస్తారు.
నియామక ప్రక్రియ..
ఎస్సీ, ఎస్టీ, బీసీలు, వికలాంగులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు కల్పిస్తారు. 80 శాతం పోస్టులను స్థానిక అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మిగిలిన 20శాతం పోస్టులను స్థానిక, స్థానికేతరులకు రూల్స్ ప్రకారం కేటాయిస్తారు. స్థానికులంటే... పోస్టుకు సంబంధించి కనీస విద్యార్హతలు ఏ ప్రాంతంలో పొంది ఉన్నారో దాన్నిబట్టి స్థానికులుగా గుర్తిస్తారు. వరుసగా గడచిన నాలుగు సంవత్సరాలు ఏ ప్రాంతంలో చదివి ఉంటే ఆ ప్రాంతానికి స్థానికులుగా పరిగణిస్తారు. నాలుగేళ్లు చదవకపోయినా గత నాలుగేళ్లు వరుసగా ఆ ప్రాంతంలో నివాసముంటే అలాంటి వారిని కూడా స్థానికులుగా గుర్తిస్తారు. రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చి ఉంటే వారు స్థానికత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
27-07-2019 నుంచి దరఖాస్తుల స్వీకరణ
వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేసిన పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు
22 రకాల పోస్టులను భర్తీ చేయనున్న సర్కారు
మొత్తం 1,36,087 ప్రభుత్వోద్యోగాల భర్తీ
ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తుల స్వీకరణ
మూడు ప్రత్యేక వెబ్‌సైట్ల ఏర్పాటు
27-07-2019 ఉ.11 గంటల నుంచి అందుబాటులోకి
విద్యార్హత, వయో పరిమితి,ఎంపిక విధానం వంటి వివరాలన్నీ వెబ్‌సైట్‌లో
ఆగస్టు 10 అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ
సెప్టెంబరు 1న రాత పరీక్ష.. 150 మార్కులు,150 ప్రశ్నలు.. నెగిటివ్ మార్కులు కూడా
ఇప్పటికే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేసే వారికి వెయిటేజీ
1,26,728 ప్రభుత్వోద్యోగ నియామకాలకు సంబంధించిన రెండు నోటిఫికేషన్లు శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి. గ్రామ సచివాలయాల్లో 95,088 ఉద్యోగాలకు పంచాయతీరాజ్ శాఖ.. పట్టణ వార్డు సచివాలయాల్లో 31,640 ఉద్యోగాలకు పట్టణాభివృద్ది శాఖ నోటిఫికేషన్లను వేర్వేరుగా జారీచేశాయి.
27-07-2019 ఉ.11 గంటల నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది.
ఆగస్టు 10వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది.
సెప్టెంబరు ఒకటవ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు.
గ్రామీణ ప్రాంతాల్లో 11,158 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తుండగా..
పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాలను ఏర్పాటుచేస్తున్నారు.
వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పోలీస్ తదితర 11 ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ మొత్తం 22 రకాల ఉద్యోగాలను సర్కారు భర్తీచేస్తుంది.
రెండంచెల పరీక్ష విధానం..
అన్ని రకాల ఉద్యోగాల భర్తీకి రెండంచెల పరీక్ష విధానం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
ప్రతి ఉద్యోగానికి 150 మార్కులకు రెండు పేపర్ల విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు.
ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.
తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కింగ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు.
గ్రామ సచివాలయాల్లో పనిచేయడం కోసం భర్తీచేసే వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు, వేల్పేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు ఉదయం 75 మార్కులకు జనరల్ నాలెడ్జిలో, సాయంత్రం 75 మార్కులకు రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అంశాలపై పరీక్ష నిర్వహిస్తారు.
అలాగే, ఏఎన్‌ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, విలేజీ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజీ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజీ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు ఉదయం 50 మార్కులకు జనరల్ నాలెడ్జిపై..
సాయంత్రం వంద మార్కులకు రీజనింగ్, మెంటల్ ఎబిలిటీతో పాటు ఆయా ఉద్యోగానికి సంబంధించిన అంశాలపై పరీక్ష ఉంటుంది.
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ
కాగా, ఇప్పటికే ఆయా శాఖల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తూ నోటిఫికేషన్‌లో పేర్కొన్న మేరకు వారికి అర్హత ఉండి రాత పరీక్షకు హాజరైతే.. అలాంటి అభ్యర్థులకు వెయిటేజీ ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఒక్కో ఉద్యోగానికి ఆ శాఖలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఈ వెయిటేజీ వేర్వేరుగా ఉంటుంది.

మూడు ప్రత్యేక వెబ్‌సైట్ల ద్వారా..
కాగా, ఆయా ఉద్యోగాలకు అర్హులైన నిర్యుదోగ యువత నుంచి అన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు gramasachivalayam. ap. gov. in , vsws. ap. gov. in , wardsachivalayam. ap. gov. in అనే మూడు ప్రత్యేక వెబ్‌సైట్లను సిద్ధంచేశారు.రెండంచెల పరీక్ష విధానం..
అన్ని రకాల ఉద్యోగాల భర్తీకి రెండంచెల పరీక్ష విధానం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
ప్రతి ఉద్యోగానికి 150 మార్కులకు రెండు పేపర్ల విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు.
ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.
తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కింగ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు.
గ్రామ సచివాలయాల్లో పనిచేయడం కోసం భర్తీచేసే వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు, వేల్పేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు ఉదయం 75 మార్కులకు జనరల్ నాలెడ్జిలో, సాయంత్రం 75 మార్కులకు రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అంశాలపై పరీక్ష నిర్వహిస్తారు.
అలాగే, ఏఎన్‌ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, విలేజీ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజీ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజీ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు ఉదయం 50 మార్కులకు జనరల్ నాలెడ్జిపై..
సాయంత్రం వంద మార్కులకు రీజనింగ్, మెంటల్ ఎబిలిటీతో పాటు ఆయా ఉద్యోగానికి సంబంధించిన అంశాలపై పరీక్ష ఉంటుంది.
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ
కాగా, ఇప్పటికే ఆయా శాఖల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తూ నోటిఫికేషన్‌లో పేర్కొన్న మేరకు వారికి అర్హత ఉండి రాత పరీక్షకు హాజరైతే.. అలాంటి అభ్యర్థులకు వెయిటేజీ ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఒక్కో ఉద్యోగానికి ఆ శాఖలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఈ వెయిటేజీ వేర్వేరుగా ఉంటుంది.

No comments:
Post a Comment