Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

NEET (UGC) - 2020 --NOTIFICATION

NEET (UGC)  - 2020


NEET 2020 Notification | ప్రతీ ఏటా జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-NEET దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మెడికల్ అడ్మిషన్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA నీట్ 2020 పరీక్ష నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

1. మీరు ఇంటర్ పాసయ్యారా? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారా? వైద్య వృత్తిలో స్థిరపడటం మీ కలా? అయితే మీకు శుభవార్త. నీట్ 2020 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA అధికారిక వెబ్‌సైట్ ntaneet.nic.in ఓపెన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

2. ఈ ఏడాది నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రామ్స్‌ కోసం ఒకే ఎంట్రెన్స్ టెస్ట్ నీట్ 2020 మాత్రమే జరగనుంది. గతంలో AIIMS, PIGMER లాంటి సంస్థలు వేర్వేరుగా ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించేవి.

3. కానీ... 2020-21 విద్యాసంవత్సరం నుంచి ఒకే ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి ఎయిమ్స్, జిమ్‌మర్, ప్రైవేట్ కాలేజీలు, రాష్ట్ర ప్రభుత్వ కాలేజీలు, AFMC, ESIC లాంటి విద్యాసంస్థల్లో అన్ని మెడికల్, డెంటల్ సీట్లు నీట్ 2020 ద్వారానే భర్తీ కానున్నాయి.

4. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకునేవారు కూడా నీట్ 2020 ఎగ్జామ్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది.

5. ఇక నీట్ 2020 నోటిఫికేషన్ వివరాలు చూస్తే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 2019 డిసెంబర్ 2న ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ 2020 జనవరి 1 రాత్రి 11.50 గంటలు.

6. దరఖాస్తు ఫామ్‌లో తప్పులు కరెక్షన్స్ చేయడానికి 2020 జనవరి 15 నుంచి 2020 జనవరి 31 వరకు అవకాశం ఉంటుంది.

7. నీట్ 2020 అడ్మిట్ కార్డుల్ని 2020 మార్చి 27 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2020 మే 3న పరీక్ష జరుగుతుంది. 2020 జూన్ 4న ఫలితాలు విడుదలవుతాయి.

8. విద్యార్హత వివరాలు చూస్తే 10+2 పూర్తైన, 10+2 చదువుతున్నవారు నీట్ 2020 పరీక్షకు దరఖాస్తు చేయొచ్చు. 10+2 స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ / బయో టెక్నాలజీ ఉండాలి. ఇంగ్లీష్‌తో పాటు మ్యాథమెటిక్స్ కూడా ఉండాలి.

9. నీట్ 2020 పరీక్షకు దరఖాస్తు చేయడానికి 2019 డిసెంబర్ 31 నాటికి కనీస వయస్సు 17 ఏళ్లు. గరిష్ట వయస్సు 25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 ఏళ్లు గరిష్టవయస్సులో పరిమితి ఉంటుంది.

10. నీట్ 2020 ఎగ్జామ్ ఫీజు గతంతో పోలిస్తే 5% నుంచి 7% పెరిగింది. జనరల్ అభ్యర్థులకు రూ.1500, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1400, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు రూ.800.

11. నీట్ 2020 పరీక్షకు దరఖాస్తు చేయాల్సిన వెబ్‌సైట్స్ www.nta.ac.in, ntaneet.nic.in

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND