Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

Income Tax --ఆర్థిక సంవత్సరం 2019-2020లో ఆదాయపన్ను వివరాలు

ఆర్థిక సంవత్సరం 2019-2020లో ఆదాయపన్ను  వివరాలు


ఉద్యోగులు అందరికీ ఆదాయం నుండి స్టాండర్డ్   డి డ క్షిన్  రు 50,000/-లు మినహాయింపు లభిస్తుంది.
Taxble Income రు 5 లక్ష లు మించని వారికి మనము pay చేయవలసిన టాక్స్ నుండి రు 12,500/- మినహాయింపు లభిస్తుంది.
80CCD 1B ప్రకారం CPS ఉద్యోగులు రు 150000/- లు పోను మరో 50000/-  మినహాయింపు ఉంటుంది
ఇల్లు కొనడానికి లేదా  కట్టుకొనడానికి తీసుకున్న అప్పు మీద వడ్డీ కి ,2014-15 మరియు ఆ తరువాత  అప్పు తీసుకుంటే గరిష్టంగా  రు 200000/-లు,2001-02 నుండి 2013-14 మధ్య తీసుకుంటే గరిష్టంగా రు 150000/-లు,2001-02 కంటే ముందు తీసుకుంటే  గరిష్టంగా రు 30000/- మినహాయింపు కలదు.
➧ Spouse కూడా పన్ను చెల్లింపు దారు అయిన యెడల జాయింట్ అకౌంట్  ద్వారా లోను తీసుకొని ఉంటే  ఇద్దరు దామాషా ప్రకారం పన్ను మినహాయింపు పొందవచ్చును.
మెడికల్ ఇన్సూరెన్స్ కి     సంబంధించి రు 25,000/-
వరకు మినహాయింపు కలదు
విద్యా ఋణ ము  కు సంబంధించి చెల్లించే  వడ్డీ కి పన్ను మినహాయింపు ఉంటుంది. గరిష్ట  పరిమితి లేదు. ఇద్దరు పిల్లలు కు మాత్రమే పరిమితం.
బ్యాంకు పొదుపు ఖాతాలో దాచుకున్న మొత్తం పై వచ్చిన వడ్డీ పై  రు 10,000/- గరిష్ట పరిమితి తో మినహాయింపు ఉంటుంది.
ఉద్యోగి వికలాంగుడు అయితే రు 75,000/- లు మినహాయింపు ఉంటుంది. అంగవైకల్యం 80% పై గా ఉన్నవారికి రు 1,25,000/-మినహాయింపు ఉంటుంది.     
2019-20 ఆర్థిక సంవత్సరం కి ఆదాయపన్ను  శ్లాబులు
1.రు.  2,50,000/-  వరకు పన్ను లేదు
2.రు. 2,50,000/- నుండి రు 3,00,000/- వరుకు  5 శాతం
3. రు 3,00,000/- నుండి రు 5,00,000/- వరకు  రు 2,500+5 శాతం
4.రు 5,00,000/- నుండి  రు 10,00,000/- వరకు  రు 12,500 +20  శాతం
5. రు 10,00,000/-లకు పైన రు 1,10,000+30 శాతం

No comments:

Post a Comment