Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

SBI FASTag--ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి... ఎస్‌బీఐలో కొనండి ఇలా

ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి... ఎస్‌బీఐలో కొనండి ఇలా

SBI FASTag | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఫాస్ట్‌ట్యాగ్‌లు అమ్ముతోంది. ఎస్‌బీఐ పాయింట్ ఆఫ్ సేల్‌ లేదా ఆథరైజ్డ్ ఏజెంట్ల దగ్గర ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవచ్చు.
జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల దగ్గర ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ ఫీజు వసూలు చేసేందుకు డిసెంబర్ 1 నుంచి అన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. టోల్ గేట్ నుంచి వెళ్లే ప్రతీ వాహనానికి ఇక ఫాస్ట్‌ట్యాగ్ ఉండాల్సిందే. లేకపోతే రెండింతలు టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్‌ అమ్మకాలకు డిమాండ్ పెరిగిపోయింది. ఫాస్ట్‌ట్యాగ్‌ను ఎక్కడైనా కొనొచ్చు. వేర్వేరు బ్యాంకులు, నేషనల్ హైవే టోల్ ప్లాజాలు, ఆర్‌టీఓలు, కామన్ సర్వీస్ సెంటర్లు, ట్రాన్స్‌పోర్ట్ హబ్స్, బ్యాంక్ బ్రాంచ్‌లు, ఎంపిక చేసిన పెట్రోల్ బంకులు, వ్యాలెట్ సర్వీసులు అందించే సంస్థల దగ్గర్నుంచి ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేయొచ్చు. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పేటీఎం పేమెంట్ బ్యాంక్, అమెజాన్‌లో కూడా మీకు ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవచ్చు. 12,000 పైగా బ్యాంక్ బ్రాంచ్‌లు, 28,500 పాయింట్ ఆఫ్ సేల్‌ లొకేషన్స్ దగ్గర ఫాస్ట్‌ట్యాగ్‌లు అందుబాటులో ఉంటాయి.
SBI FASTag: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫాస్ట్‌ట్యాగ్ కొనండి ఇలా...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఫాస్ట్‌ట్యాగ్‌లు అమ్ముతోంది. ఎస్‌బీఐ పాయింట్ ఆఫ్ సేల్‌ లేదా ఆథరైజ్డ్ ఏజెంట్ల దగ్గర ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవచ్చు. కస్టమర్లు రెండు రకాలుగా అకౌంట్లు ఓపెన్ చేయొచ్చు. అందులో ఒకటి లిమిటెడ్ కేవైసీ హోల్డర్ అకౌంట్.ఇది ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ ఫాస్ట్‌ట్యాగ్ ప్రీపెయిడ్ అకౌంట్‌లో రూ.10,000 కన్నా ఎక్కువ ఉండకూడదు. నెలకు రూ.10000 కన్నా ఎక్కువ రీలోడ్ చేయలేరు. రెండోది ఫుల్ కేవైసీ హోల్డర్ అకౌంట్. ఇది కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇందులో రూ.1,00,000 వరకు లోడ్ చేసుకోవచ్చు. రీలోడ్‌కు ఎలాంటి పరిమితి లేదు. కానీ... ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్‌లో రూ.1,00,000 కన్నా ఎక్కువ ఉండకూడదు. టోల్ ప్లాజా దగ్గర పేమెంట్ పూర్తి కాగానే కస్టమర్‌కు ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది. ఛార్జీలు ఈ విధంగా ఉంటాయి.

No comments:

Post a Comment