Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక కావాలంటే ఇక నుండి కచ్చితంగా ఇంగ్లీషులో పరిజ్ఞానం ఉండి తీరాల్సిందే

ఇంగ్లీషు వస్తేనే..!
                 ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక కావాలంటే ఇక నుండి కచ్చితంగా ఇంగ్లీషులో పరిజ్ఞానం ఉండి తీరాల్సిందే! వచ్చే విద్యాసంవత్సరంలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం మాత్రమే ఉంటుందని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ మేరకు 85 వ నెంబర్‌ జిఓను విడుదల చేసింది. దీని ప్రకారం ఇప్పటికే ఉపాధ్యాయ పరీక్షల్లో అర్హత సాధించినప్పటికీ ఇంగ్లీషులో నైపుణ్యం లేకపోతే ఉద్యోగంపై ఆశలను వదులుకోవాల్సిందే! 'ఉపాధ్యాయ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు ఆంగ్లంలో పరిజ్ఞానం ఉంటేనే భర్తీచేస్తాం' అని జిఓలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులకు ఆంగ్లంలో ఎస్‌సిఈఆర్‌టి వచ్చే వేసవిలో శిక్షణ ఇవ్వనుంది. అదే విధంగా ఇప్పటికే ఎంపికైన అభ్చర్థులకు కూడా శిక్షణ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశలో ఆలోచించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

No comments:

Post a Comment