Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఎపిపిఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు

ఎపిపిఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు

డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌లో ఎపిపిఎస్సీ స్వల్ప మార్పులు చేసింది. ఈ మేరకు ఎపిపిఎస్సీ కార్యదర్శి ఎకె మౌర్య ప్రకటన విడుదల చేశారు. పాత షెడ్యూల్‌ ప్రకారం డిగ్రీ కాలేజీ లెక్చరర్ల పోస్టుల మెయిన్‌ పరీక్ష నవంబర్‌ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుతం నవంబర్‌ 29, 30వ తేదీలలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.

       టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్‌ మెయిన్‌ పరీక్ష ముందు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 6,8వ తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా, నవంబర్‌ 6, 7వ తేదీల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. నవంబర్‌ 6న ఉదయం పేపర్‌–1,  మధ్యాహ్నం పేపర్‌– 2 పరీక్షలను నిర్వహిస్తారు. పేపర్‌–3 పరీక్షను నవంబర్‌ 7న మధ్యాహ్నం నిర్వహించనున్నారు.

No comments:

Post a Comment