Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

అకడమిక్ క్యాలెండర్ 2019-20 ప్రకారము దసరా సెలవులు..---సెప్టెంబరు 28 నుండి అక్టోబరు 9 వరకు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని మేనేజ్ మెంట్ల‌ ఉన్నత,ప్రాథమికోన్నత,ప్రాధమిక పాఠశాలలకు అకడమిక్ క్యాలెండర్ 2019-20  ప్రకారము
దసరా సెలవులు..

సెప్టెంబరు 28 నుండి అక్టోబరు 9 వరకు
ఈమేరకు జిల్లా వారీగా డి.ఇ.ఓ  లు ఉత్తర్వులు యిచ్చారు

Sept 27  A.N. మరియు Oct 10 వతేదీ F.N.న తప్పని సరిగా పాఠశాలలకు  హాజరుకావాలి.

SUFFIX & PREFIX హాజరు కావాలి
CL/Spl CL అనుమతించబడవు.
దసరా.. సంక్రాంతి సెలవులు.. suffix.. preffix పై వివరణ
దసరా/సంక్రాంతి సెలవులు 9 రోజులు ప్రకటించినపుడు (ఆదివారంతో కలిపి) చివరి రోజు గానీ , బడి తెరిచే రోజు గానీ (రెండింటిలో ఒకటి మాత్రమే) సాధారణ సెలవు(CL) పెట్టుకోవచ్చు.
దసరా/సంక్రాంతి సెలవులు 10 లేక 11 లేక 12 లేక 13 లేక 14 రోజులు (ఆదివారంతో కలిపి) ప్రకటించినపుడు చివరి రోజూ , బడి తెరిచేరోజు (రెండు రోజులు)తప్పక బడికి వెళ్ళాలి.అలా వెళ్లకపోతే మొత్తం సెలవులకి అర్హత గల సెలవు పెట్టవలసి ఉంటుంది. అనగా EL/MCL/HPL/EOL లలో ఏదోఒకటి పెట్టవలసి ఉంటుంది.
దసరా/సంక్రాంతి సెలవులు 15 లేక అంతకంటే ఎక్కువ రోజులు (ఆదివారంతో కలిపి) ప్రకటించినపుడు బడి చివరి రోజు గానీ , బడి తెరిచేరోజు గానీ (రెండింటి లో ఒక రోజు మాత్రమే) అర్హత గల సెలవు పెట్టుకోవచ్చు. అర్హత గల సెలవు అనగా EL/HPL/MCL లలో ఒకటి 1 రోజు కోసం వాడుకోవచ్చు.

గమనిక :- ఈ సంవత్సరం దసరా సెలవులు 28.9.19 నుంచి 09.10.19 వరకు అనగా మొత్తం 12 రోజులు.కావున 27వ తేదీ మధ్యాహ్నం సెక్షన్ ( చివరి రోజు ) మరియు 10వ తేదీ ఉదయం సెక్షన్ ( బడి తెరిచే రోజు ) తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలి.ఈ రెండు రోజులలో ఏ ఒక్క రోజు హాజరుకాకపోయిన ఈ 12 రోజులు అర్హతగల EL/HPL/MCL/EOL లలో ఏదోఒకటి పెట్టవలసి ఉంటుంది.

No comments:

Post a Comment