Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

Earned Leave ( సంపాదిత సెలవు )

సంపాదిత సెలవు (Earned Leave): ఎ) సరళీకృతము చేయబడిన నిబంధనల మేరకు నాన్-వెకేషన్ డిపార్టుమెంట్
ఉద్యోగులకు ప్రతి జనవరి 1న 15 రోజులు, జులై 1న 15 రోజులు చొప్పున అడ్వాన్సుగా జమ చేయబడును. (జి.ఓ. 384
ఆర్థిక తేది. 05.11.1977 - అధ్యాపక దర్శిని, 2) వెకేషన్ డిపార్టుమెంట్ వారికి జనవరి 1న 3 రోజులు, జులై 1న 3
రోజులు చొప్పున జమ చేయబడును. (జి.ఓ. 317 ఆర్థిక, తేది. 15.09.1994 అ.ద. 12). తాత్కాలిక ఉపాధ్యాయులకు
అందులో సగము (2+2) యివ్వబడుతుంది. వారు శాశ్వత ఉద్యోగులైన పిదప మిగిలిన సెలవు తిరిగి జమ (రీక్యాస్ట్)
చేయబడుతుంది. 300 రోజులకు మించి యీ సెలవు నిల్వవుండదు. (జి.ఓ. 232 ఆర్థిక, తేది. 19.02.2005 - అద.
22) ఒకేసారి గాని, ఇతర సెలవులతో కలిపి గాని, 180 రోజుల వరకు వాడుకొనవచ్చును (ఎపిఎఆర్ 11 & 12).
(జి.ఓ. నం. 153 ఆర్థిక, తేది. 04.05.2010).
బి) వేసవి సెలవులలో డ్యూటీ చేసినప్పుడు పనిచేసిన దినములకు మాత్రమే వేసవి సెలవులు కోల్పోయినట్లుగా భావించి ఆ  రోజులకు మాత్రమే సంపాదిత సెలవు జమ చేస్తారు. (జి.ఓ.ఎంఎస్.నం. 114 ఆర్థిక, తేది. 28.04.2005).
సి) వేసవి సెలవులు 15 రోజులకన్నా తక్కువుగా వినియోగించుకుంటే మొత్తం వేసవి సెలవులు కోల్పోయినట్లు భావించి సంపాదిత సెలవు నమోదు చేయాలి. ఎస్ఆర్ 82, రూల్ 6(a).

వేసవిలో విధి నిర్వహణకు సంపాదిత సెలవు =
            [365x  1/11 ] - [27 X వాడుకొన్న సెలవులు/ మొత్తం  సెలవులు ] - 6 
                                                                                                              -