Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

Casual Leave (CL)

క్యాజువల్ లీవు (Casual Leave): ఒక క్యాలండరు సంవత్సరములో 15 రోజుల వరకు వాడుకొనవచ్చును. మహిళా
ఉపాధ్యాయులు అదనంగా మరో 5 రోజులు వాడుకొనవచ్చును. (జిఓ 374, తేది. 16.03. 1996 - అ.ద.14), ప్రభుత్వ
సెలవు దినములతో కలిపి యీ సెలవును 10 రోజులకు మించకుండా వాడుకొనవచ్చును. ఈ సెలవు స్పెషల్ టీచర్లకు,
అప్రెంటిస్ టీచర్లకు, స్పెషల్ విద్యావాలంటీర్లకు, వారు పనిచేసిన కాలాన్ని బట్టి దామాషా ప్రకారము మంజూరు చేయబడుతుంది.

సాధారణ సెలవు (C.L.): ప్రతి ఉద్యోగి సం||మునకు 15రోజుల చొప్పున సాధారణ సెలవును జనవరి నుండి
డిసెంబర్ వరకు క్యాలెండర్ సం||లో వాడుకోవాలి (G.O.Ms.No.52 dt: 4.2.1981) ఆదివారములు, సెలవు
దినములతో కలిపి కూడా వాడుకోవచ్చు. అయితే వరుసగా మొత్తం 10 రోజులకు మించరాదు. తాత్కాలిక ఉ
ద్యోగులకు వారి సర్వీసును బట్టి దామాషాలో వరుసగా మంజూరు చేస్తారు. సాధారణ సెలవు నియమాలలోని
సెలవుతోగాని, జాయినింగ్ కాలముతో గాని, వెకేషతో గాని జతపరచరాదు. 1/2 రోజు సెలవు కూడా మంజూరు
చేయవచ్చును. కాని ఒంటిపూట బడి విషయంలో 1/2రోజు సెలవు పెట్టరాదు. ఈ సెలవు సౌకర్యం అప్రెంటీస్
టీచర్లకు కూడా వర్తించును (+.9.వీం.. చీశీ. 134, స్: 10.6.1996).
G.O.Ms.No.374 విద్య Dt:16.3.1996 ప్రకారం మహిళలకు సంవత్సరమునకు (5) రోజులు అదనంగా
సి.యల్స్. ఇవ్వబడును, ఈ సౌకర్యం G.O.MO.03 F&P Dt:5.1.2011 ద్వారా జూనియర్ లెక్చరర్లకు
కల్పించబడినది.