Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఫోన్‌ పోయిందా ! పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌పే ఖాతాలను ఆపండిలా

ఫోన్‌ పోయిందా ! పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌పే ఖాతాలను ఆపండిలా...

ఏం కొన్నా.. తిన్నా.. ఇప్పుడు అంతా యూపీఐ చెల్లింపులే చేస్తున్నారు. ప్రతీ ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్‌ ఉండటం, మొబైల్‌ ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడంతో పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌పేల వినియోగం పెరిగిపోయింది మరి. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) డాటా ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌లో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలు రూ.11 లక్షల కోట్లను దాటాయి. అయితే మోసాలూ అంతే స్థాయిలో జరుగుతున్నాయి.


స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నవారిలో చాలామంది ఖాతాల నుంచి నగదు మాయమవుతున్నది చూస్తూనే ఉన్నాం. మన బ్యాంక్‌ ఖాతాలతో అనుసంధానమైన పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌పే వంటి యూపీఐ యాప్స్‌ ద్వారానే ఈ నష్టం వాటిల్లుతున్నది. కాబట్టి ఫోన్‌ పోయిందని తెలిసిన వెంటనే అందులోని యూపీఐ యాప్స్‌ను పనిచేయకుండా బ్లాక్‌ చేయాలి. ఇది ఎలాగంటే..

ఈ మార్గదర్శకాలను అనుసరించాలి..

1. కస్టమర్‌ కేర్‌ సాయం కోరాలి.

2. ఫోన్‌ పోయిందన్న ఆప్షన్‌ను తీసుకోవాలి.

3. వేరే ఫోన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి, పోయిన ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ చేయాలని తెలియపర్చాలి.

4. అన్ని డివైజ్‌ల ఆప్షన్‌ నుంచి లాగౌట్‌ను ఎంచుకోవాలి.


పేటీఎం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, ఫోన్‌ పోయిందన్న సమాచారాన్ని ఇచ్చి వినియోగదారులు తమ ఖాతాను తాత్కాలికంగా బ్లాక్‌ చేసుకోవచ్చు. ఈ క్రమంలో కస్టమర్లు తమ డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు స్టేట్‌మెంట్‌/ఎస్‌ఎంఎస్‌ను సమర్పించాల్సి ఉంటుంది.*

డాటా రక్షణ ఇలా..

స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నవారు ఆండ్రాయిడ్‌ వినియోగదారులైతే ‘android.com/ find’ ద్వారా తమ డాటా దుర్వినియోగాన్ని అడ్డుకోవచ్చు. మీ జీమెయిల్‌ ఖాతా తెరిచి, స్మార్ట్‌ఫోన్‌ పోయిందన్న ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అలాగే యాపిల్‌ (ఐవోఎస్‌) కస్టమర్లు Find My App ద్వారా ఫోన్‌ డాటాను సంరక్షించుకోవచ్చు.

హెల్ప్‌లైన్‌ నెంబర్లు

గూగుల్‌ పే ఖాతాను బ్లాక్‌ చేయడానికి 18004190157 అనే కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు ఫోన్‌ చేయాలి. అలాగే పేటీఎం ఖాతాను ఆపడానికి 01204456456 అనే నంబర్‌ను సంప్రదించాలి. ఫోన్‌పే కోసం 08068727374 లేదా 02268727374 నంబర్లకు కాల్‌ చేయవచ్చు.

No comments:

Post a Comment