Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

SBI alert: ఎస్‌బీఐ అకౌంట్ ఉందా?.. ఖాతాదారులకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్..

SBI alert: ఎస్‌బీఐ అకౌంట్ ఉందా?.. ఖాతాదారులకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్...

యూపీఐ(UPI) పేమెంట్లు అందుబాటులోకి వచ్చాక దేశంలో చెల్లింపుల తీరుతెన్నులు మారిపోయాయి. 2016లో మొదలైన ఈ పేమెంట్లు జనదరణ పొందుతున్నాయి. భద్రంగా, వేగంగా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం ఉండడంతో యూజర్లు కూడా మొగ్గుచూపుతున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డేటా ప్రకారం.. ఆగస్టులో యూపీఐ పేమెంట్ల విలువ ఏకంగా రూ.10.7 లక్షల కోట్లుగా ఉంది. అయితే ఈ డిజిటల్ యుగంలో చెల్లింపుల విషయంలో యూజర్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పెరిగిపోతున్న ఆన్‌లైన్ మోసాల నేపథ్యంలో అవగాహన పెంచుకుని జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్‌బీఐ.. యూపీఐ పేమెంట్లు చేస్తున్న తన ఖాతాదారుల కోసం కీలకమైన పలు సూచనలు చేసింది. అవేంటో మీరు కూడా తెలుసుకోండి..

యూపీఐ పేమెంట్ టిప్స్..

1. డబ్బుని స్వీకరించే సమయంలో యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. యూపీఐ పిన్ ఎంటర్ చేయాలంటూ ఏమైనా మెసేజీలు వస్తే వాటిని పట్టించుకోకండి.

2. ఏ వ్యక్తికి డబ్బు పంపించాలనుకుంటున్నారో అతడి గుర్తింపుని జాగ్రత్తగా వేరిఫై చేసుకోవాలి. మీరు పంపించాలనుకుంటున్న వ్యక్తి అతడేనా లేక ఫేక్ అకౌంటా అనేది నిర్ధారించుకోవడం ఉత్తమం. ఆ తర్వాత డబ్బు పంపించాలి.

3. డబ్బు కోరుతూ పదేపదే గుర్తుతెలియని విజ్ఞప్తులు వస్తే యాక్సెప్ట్ చేయొద్దు.

4. యుపీఐ అనేది సీక్రెట్ పిన్. సెక్యూరిటీ కోడ్ లాంటి ఈ పిన్‌ని ఎవరికీ తెలియనివ్వకూడదు. డబ్బుని పంపించేటప్పుడు మాత్రమే పిన్‌ని ఉపయోగించాలి. ఎవరితోనూ పంచుకోవచ్చు.

5. షాప్స్ లేదా వ్యక్తుల వద్దైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం ఉత్తమం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు వ్యక్తి వివరాలు కనిపిస్తాయి. వాటిని నిర్ధారించుకోవచ్చు. 

6. యూపీఐ పిన్‌ని ఎప్పటికప్పుడు మార్చుకోవడం మంచిది. పిన్‌ ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు

No comments:

Post a Comment