Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో 8000 టీచర్ పోస్టులను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ ని విడుదల.

ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో 8000 టీచర్ పోస్టులను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ ని విడుదల.


ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే..


ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) టీచర్ పోస్టులని భర్తీ చేస్తోంది. దీనిలో మొత్తం 8000 ఖాళీలు వున్నాయి. పోస్టుల వివరాల లోకి వెళితే.. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), ప్రైమరీ టీచర్ (PRT) ఖాళీలు వున్నాయి.


అప్లై చేసుకోవాలని అనుకునే వారు WES వెబ్‌సైట్ awesindia.com లేదా register.cbtexams ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి దరఖాస్తు చెయ్యడానికి 5 అక్టోబర్ 2022 చివరి తేదీ. ఇక అర్హత వివరాలను చూస్తే.. అభ్యర్థులు 50% మార్కులతో బీఈడీ, పీజీ ఉత్తీర్ణులై ఉంటే PGT పోస్టులకి అర్హులు.


అభ్యర్థులు 50% మార్కులతో బీఈడీ, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉంటే TGT పోస్టులకి అర్హులు. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఈడీ, డీఈడీ కలిగి ఉంటే PRT పోస్టులకి అర్హులు. వయస్సు విషయానికి వస్తే… ఫ్రెషర్స్ కి 40 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. అదే అనుభవం ఉంటే 57 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

Websites...

awesindia.com 

register.cbtexams


No comments:

Post a Comment