Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

CORONA VIRUS - Dr Geyanand, Ex PDF MLC, JVV Activist

Dr Geyanand, Ex PDF MLC, JVV Activist
మిత్రులారా
    "కనీసం రెండు, మూడు వారాలు, మీ ఇంట్లోనే స్వీయ నిర్బంధం,స్వచ్చంద నిర్బంధం విధించు కోండి "- అని మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయడానికి ఇది రాస్తున్నాను.ఒక డాక్టర్ గా, ఒక ప్రజా సైన్స్ ఉద్యమ కార్య కర్త గా, మీ అందరికి ప్రాతినిధ్యం వహించిన ఒక మాజి ప్రజా ప్రతి నిధి గా మీ కీ విజ్ఞప్తి చేస్తున్నాను.
   మనలో ఎవరికైనా, covid..19 అనబడే కరోనా వైర స్, రాబోయే వారాల్లో సోకవచ్చు. నిర్లక్ష్యం చేస్తే, కనీసం సగం మందికి వస్తుందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్ని అన్నిటినీ బేరీజు వేసి చెబుతున్న మాట ఇది. కానీ ఇప్పటికీ నియంత్రించే అవకాశం ఇప్పటికి ఉంది.
   కరోనా 'సామూహిక వ్యాప్తి'(కమ్యూనిటీ ట్రాన్స్మిషన్) దశ లో ఉందా? లేదా? అనే వివాదం ఉంది. నేను 'ఉంది' అనే అంటున్నాను.చాలా మంది నిపుణులు కూడా అదే చెబుతున్నారు. చాలా కరోనా కేసులు మన చుట్టూనే(మనకు అనుమానం రాకుండానే )ఉండొచ్చని దాని అర్థం. వ్యాధి లక్షణాలు(దగ్గు,జ్వరం) బయట పడక ముందే(asymptomatic) ఇతరులకు సోకె అవకాశం ఇందులో ఉంది.
   మన అజాగ్రత్త వల్ల-మన కో,మన కుటుంబానికో, మన స్నేహితులకో, బంధువులకో, మన చుట్టుపక్కల వారికో-కరోనా రాకుండా చూసుకో వాల్సిన బాధ్యత మన మీద ఉందని దాని అర్థం.
   జాగ్రత్త అంటే అరకొర జాగత్తలు కాదు,'చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవడం'-అని కూడా కాదు.జాగ్రత్త అంటే నూటికి నూరు శాతం(100%) జాగ్రత్తలు అని అర్థం.
➧ఒక మీటరు దూరం పాటించడం(social distancing),
➧గంట కొకసారి చేతులు సబ్బు తో కడుక్కోవడం,
➧అన్ని ప్రయాణాలు మానుకోవడం,
➧అన్ని ఫంక్షన్స్ మానుకోవడం, క్యాన్సల్ /వాయిదా వేయడం.
➧అన్ని సభలు సమావేశాలూ మానుకోవడం,
➧అన్ని ఉత్సవాలు మానుకోవడం,
➧గుంపులు(5-10 మంది) లేకుండా చూసుకోవడం,
➧గుంపుల లోకి పోకుండా ఉండ టం,
➧ఎవరి ఇంటికి పోకుండా ఉండటం,
➧బయటకు పోకుండా ఉండటం,
➧గడప దాటకుండా ఉండటం
➧ఆఫీస్ లకు సెలవు పెట్టడం
ఇంటి బయటి నుండి వచ్చే అన్ని సరుకులు,(న్యూస్ పేపర్లు, పాల పొట్లాలు, ఇతర పొట్లాలు etc.) , వాటి ఉపరి తలాలు(surfaces) శుభ్ర పరచి లోపలికి తెచ్చు కోవడం
గోడలు,మెట్ల రైలింగ్స్,కుర్చీలు,టేబుల్స్,..surfaces అన్నింటిని సబ్బు నీళ్లతో శుభ్రం చేసి కోవడం
పిల్లలు గడప దాటి బయటకు పోకుండా జాగ్రత్త పడటం
    ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకోండి .ఇందులో కష్టమైనవీ ఉన్నాయి. ఆర్థిక అంశాలూ వున్నాయి. కానీ తప్పదని అర్థం చేసుకోండి.
      చివర్లో ఒక మాట. రాబోయే రెండు,మూడు వారాలు చాలా ముఖ్య మైనవి.ఈ మూడు వారాలు ఇంట్లోనే,మీకు మీరు విధించుకునే స్వయం నిర్బంధం లో ఉండండి.ఇల్లు దాటొద్దు. బయటకు పోవద్దు.ఇతరులను కలవొద్దు.మీ ఇంట్లో వాళ్ల కూ ఇటు వంటి నిబంధన లే కఠినంగా అమలు చేయండి. ఇది సైన్సు చెబుతున్న మాట.
    రేపొక్క రోజే చాలదు. కనీసం మూడు వారాలు. ఇబ్బందే కావచ్చు. కానీ ముందు ముందు రాబోయే సమస్యలతో పోల్చుకుంటే ఈ ఇబ్బంది చాలా చిన్నది.
ఇటలీ నుండి, చైనా నుండి మనం ఏమైనా నేర్చు కుందా మనుకుంటే,అది ఇదే..
Dr గేయానంద్, ex. MLC
చిన్న చిన్న ఆరోగ్య సమస్యల కు ఆసుపత్రులకు పోవద్దు.
1).జ్వరం, దగ్గు వస్తే మీ డాక్టరు ను ఫోన్ లో సంప్రదించండి.ఇంట్లో కూడా మాస్క్/కర్చీఫ్ ను ముఖానికి అడ్డంగా కట్టుకోండి. మీ దగ్గు తుంపర, నోటి తుంపర మీ కుటుంబ సభ్యు ల మీద పడ కుండా చూసుకోండి.ఆరేడు రోజులైనా తగ్గకుండా ఉంటే, ఆయాసం మొదలైతే ,తగిన పరీక్షలు చేయ గలిగిన ఆసుపత్రికి వెళ్ళండి.
2.) బీపీ, షుగర్, గుండె జబ్బులు లాంటి దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు ఉంటె,అంతకు ముందు వాడుకునే మందులే కొనసాగించండి.
3.) అత్యవసర ఆరోగ్య సలహా ఏ దైనా అవసరమైతే నాకు ఫోన్ చేయొచ్చు.(9490098919)

No comments:

Post a Comment