Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

CORONA VIRUS ( KOVID 19 )

ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఎవరూ బయటికి రావొద్దు : ప్రధాని మోదీ

దేశంలో ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని ప్రధాని మోదీ అన్నారు. కరోనాపై మాట్లాడిన మోదీ.. దేశ ప్రజలకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
నేను ఎప్పుడు అడిగిన దేశ ప్రజలు కాదనకుండా చేశారు. నేను ఈసారి కూడా మిమ్మల్ని కొన్ని అడగాలని అనుకుంటున్నాను.. అది మీ జీవితంలో రాబోయే రెండు మూడు వారాలు నాకు కావాలి.
కరోనా వ్యాప్తి కూడా అంతకంతకూ పెరుగుతోంది. వివిధ దేశాల ప్రజలు కరొనాను ధైర్యంగా ఎదుర్కొన్నారు. భారతీయులందరు కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించాలి
కరోనాకు ఇప్పటివరకు వ్యాక్సిన్ తయారు కాలేదు.
ప్రపంచం మొత్తం కరొనాతో పోరాడుతోంది. ఈ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు, అందరం చేయి చేయి కలిపి ఈ మహమ్మారిని ఎదుర్కొందాం.
ఈ విషయంలో భారత ప్రజల పాత్ర చాలా కీలకమైనది, కరోనా కట్టడికి అన్ని దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు తమ సంకల్ప బలాన్ని మరింత పెంచుకోవాలి, తమకు కరోనా అంటకుండా, అలాగే ఇతరులకు కూడా కరోనా అంటకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు.
రానున్న కొద్ది వారాలు కీలకమన్న మోదీ ఇప్పుడున్న కరోనా కంటే పెద్ద సమస్య లేదని వెల్లడించారు. వీలైనంత వరకు ప్రజలు తమ ఇంటినుంచి పనులు చేసుకోవాలని సూచించారు.
అలాగే 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు తమ ఇళ్లనుంచి బైటికి వెళ్లరాదని సూచించారు. సమూహాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఏకాంతంగా ఉంటే ఈ మహమ్మారిని అరికట్టవచ్చు అని తెలిపారు.
మార్చి 22 ఆదివారం ఉదయం 7 గంటలనుంచి రాత్రి 9 గంటల వరకూ ఎవరూ బయటికి రావొద్దని.. ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని సూచించారు.
➖➖➖➖➖➖➖➖➖➖➖
కొన్నిరోజులు దేశ ప్రజలు త్యాగం చేయండి: మోదీ
ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోందని ప్రధాని మోదీ తెలిపారు. దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ వైరస్ కన్నా ఇప్పుడు దేశానికి ఏదీ కీలకం కాదన్నారు. కరోనాను తేలిగ్గా తీసుకోమని, రాబోయే రోజులను దేశం కోసం త్యాగం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రెండో ప్రపంచయుద్ధం వల్ల కూడా ఇన్ని దేశాలు ఇబ్బంది పడలేదన్నారు. కరోనాపై యుద్ధం చేయడానికి ప్రజలందరూ తనకు సహకరించాలని, కేంద్రం సూచనలను తప్పకుండా పాటించాలని కోరారు.

కరోనాపై ఇప్పుడే ఊరట దక్కదు: మోదీ*
ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తోందని.. అనవసరంగా ఇంటి నుంచి ప్రజలెవరూ బయటకు రావొద్దని, సాధ్యమైనంత ఏకాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలని ప్రధాని మోదీ తెలిపారు. కరోనాను ఇప్పటికిప్పుడే కట్టడి చేయలేమని.. కరోనాకు శాస్త్రవేత్తలు ఇంతవరకూ మందు కూడా కనిపెట్టలేదని చెప్పారు. ఈ మహమ్మారిపై యుద్ధం చేసేందుకు దేశ ప్రజలంతా చేయిచేయి కలపాలని.. ప్రజల కోసం ప్రజలే జనతా కర్ఫ్యూ విధించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.
ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకండి: మోదీ*
మార్చి 22న దేశ ప్రజలంతా ఎవరికి వారుగా జనతా కర్ఫ్యూ విధించుకోవాలని.. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ రోజు ప్రజలు విధించుకునే కర్ఫ్యూ కరోనాపై చేసే అతిపెద్ద యుద్ధమని.. కరోనా బాధితులను డాక్టర్లు, నర్సులు ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారని అభినందించారు. వీరికి మార్చి 22న ఈ కర్ఫ్యూ ద్వారా దేశ ప్రజలు కృతజ్ఞతలు చెప్పాలన్నారు మోదీ.

No comments:

Post a Comment