Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఏపీలో రేపటి నుంచి విద్యాసంస్థల సెలవులు

ఏపీలో రేపటి నుంచి విద్యాసంస్థల సెలవులు
ఆంధ్రప్రదేశ్ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు
Rc.,92; 18/3/2020 ప్రకారం
Close all Govt., ZP/MPP, Municipal, Aided, Private un-aided Schools, Residential Schools and Welfare Institutions under all managements, Teacher Educational Institutions i.e., DIETS, CTES, IASES and Pvt. D.EI.Ed. Colleges till 31st March, 2020 with immediate effect for prevention and management of COVID-19.

అలాగే కొంతమందికి పాఠశాలల్లో పిల్లలకు మాత్రమే సెలవ లా లేక ఉపాధ్యాయులకు సెలవు లా అనే అనుమానం ఉంది. పిల్లలతో పాటు ఉపాధ్యాయులందరికీ సెలవులు.స్కూలు మూసివేయాలని ఉత్తర్వులు ఇస్తూ ,పదవతరగతి పరీక్షలు యధావిధిగా  జరుగుతాయని కూడా ఉత్తర్వులలో పొందుపరచడమైనది .

 Download Proceedings
➖➖➖➖➖➖➖➖➖

ఏపీలో రేపటి నుంచి విద్యాసంస్థలకు సెలవులు

అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారిని కట్టడిచేసేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్‌ సెంటర్లను మూసివేయాలని ఆదేశించింది. విద్య, వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

 ఈనెల 31 వరకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అనంతరం పరిస్థితిని సమీక్షించి సెలవుల పొడిగింపుపై నిర్ణయం తీసుకోనుంది.

 అటు పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు యథావిథిగా నడుస్తాయని ప్రకటించిన ప్రభుత్వం.. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంది.

Download Proceedings

No comments:

Post a Comment