Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

జగనన్న విద్యా కానుక

జగనన్న విద్యా కానుక- విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను ఉపాధ్యాయులే కొలిచి online లో  నమోదు చేయుట గురించి...
రాష్ట్ర పథక సంచాలకులు, సమగ్ర శిక్షా ఆంధ్రప్రదేశ్ వారి కార్యావర్తనములు
ప్రస్తుతం: శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, ఐ.ఎ.ఎస్.
ఆర్.సి.నెం. ఎస్.ఎస్ 16021/4/2019 ఎం.ఐ.ఎస్, ఎస్.ఇ.సి. - ఎస్ఎస్ఏ, తేది :18,03.2020
విషయం : సమగ్ర శిక్షా - జగనన్న విద్యా కానుక - విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్ధుల పాదాల కొలతలను సేకరించి నమోదు చేయుట గురించి.

1.     ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్థులకు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో  *'జగనన్న విద్యా కానుక* పేరుతో స్టూడెంట్ కిట్లను సరఫరా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
 2.     ఇందులో భాగంగా ఒక్కో స్టూడెంట్ కిట్లో మూడు జతల యూనిఫాంలు, ఒక సెట్ నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, బ్యాగు ఉంటాయి.
 3.    ప్రతి విద్యార్థికి బూట్లు పంపిణీ చేసే ప్రక్రియలో భాగంగా గత సంవత్సరంలో జరిగిన బూట్ల సరఫరాలో ఎదురైన ముఖ్య సమస్య 'బూట్ల సైజు సరిగా ఉందకపోవడం',  తద్వారా కొందరు విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు.
 4.    ఈ సమస్యను అధిగమించేందుకు సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టరు వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం కింది సూచనలు పొందుపరచడమైనది.
 బూట్ల సరఫరా కోసం విద్యార్థుల పాద కొలతలు నమోదులో పాటించాల్సిన సూచనలు
• విద్యార్థుల పాదాల కొలతలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయుట, ఈ బాధ్యతను సీఆర్పీలకు అప్పగించడమైనది.
• ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న అమ్మాయిల, అబ్బాయిల పాదాల కొలతలను తీసుకోవాలి.
• ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థుల వివరాలు అవసరం లేదు.
• విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశము.. తర్వాతి సంవత్సరానికి అనుగుణంగా (వారి పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని) పాదాల కొలత సైజును పెంచి తీసుకోవాలి.
(:: ఉదాహరణకు ఒక విద్యార్థి పాదం ప్రస్తుత సైజు 5 ఉంటే కాస్త పెంచి 6 సైజుగా నమోదు చేయాలి)
• ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో తరగతి ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి.
• ప్రధానోపాధ్యాయులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.
• ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్ లో హెడ్మాష్టరు లాగిన్ ద్వారా కొలతలు నమోదు చేయాలి.
• ప్రధానోపాధ్యాయులు/ సీఆర్పీలు ఈ కార్యక్రమాన్ని కచ్చితంగా జరిగేలా బాధ్యత వహించాలి.
• హెచ్ఎం లాగిన్లలో పొందుపరిచినటువంటి స్క్రీన్ లో 26, 03. 2020 లోగా నమోదు చేయాలి.
• అందరు జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈవోలు), సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు (ఏపీసీ)లు పై ఆదేశాలను వెంటనే అమలు పరచవలెను.
         రాష్ట్రంలో అందరూ జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్రశిక్షా అడిషనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లు పూర్తి శ్రద్ధతో పై ఆదేశాలను అత్యంత జాగరూకతతో అమలుచేయవలసిందిగా ఇందుమూలంగా ఆదేశించడమైనది.
సమగ్ర శిక్షా, రాష్ట్ర పథక సంచాలకులు,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
1. అందరు జిల్లా విద్యాశాఖాధికారులకు
2 అందరు సమగ్ర శిక్షా అదనపు కో ఆర్డినేటర్లకు
3. పాఠశాల విద్యాశాఖ కమీషనరు. వారికి

No comments:

Post a Comment