Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

APSRTC DIGITAL PAYMENTS

APSRTC DIGITAL PAYMENTS
        ఆర్టీసీ బస్సుల్లో చిల్లర కష్టాల గురించి అందరికీ తెలుసు. టికెట్‌కు సరిపడా చిల్లర లేక.. పెద్దనోట్లు ఇస్తే మిగిలిన చిల్లర డబ్బులు కండక్టర్ తిరిగి ఇవ్వలేక.. నానా కష్టాలు పడుతుంటారు. ఇటు కండక్టర్లు, అటు ప్రయాణికులు.. ఇద్దరికీ ఈచిల్లర ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో APSRTC కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. చిల్లర కష్టాలకు చెక్ పెట్టేందుకు బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ ప్రవేశపెడుతోంది. అందుకోసం ప్రత్యేకంగా CHALO యాప్ రూపొందించారు. ప్రస్తుతం చాలా వరకు దుకాణాల్లో PAYTM, PHONEPE, AMAZON PAY వంటియా క్యూర్ కోడ్ స్కాన్ చేసి కస్టమర్లు డబ్బులు చెల్లిస్తున్నారు. అచ్చం అలాగే క్యూర్ కోడ్ని స్కాన్ చేసి బస్సుల్లో టికెట్ తీసుకునే విధానాన్ని తీసుకొచ్చారు.
        ప్రస్తుతం విజయవాడలో పైలెట్ ప్రాజెక్ట్ గా క్యాష్ లెస్ టికెట్ విధానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీమడిరెడ్డి ప్రతాప్ పాల్గొన్నారు. ఛలో యాప్ సాయంతో కండక్టర్‌ వద్ద ఉండే క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి డబ్బులు చెల్లించవచ్చు. అంతేకాదు మెట్రోతరహాలో APSRTC స్మార్ట్ కార్డ్ కూడా తీసుకొచ్చారు. టిమ్ మెషీన్లో స్మార్ట్ కార్డ్ పెట్టి చెల్లింపులు చేయవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ క్యాన్లెస్ విధానం ద్వారా ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రయాణికులకూ చిల్లర కష్టాలు తప్పుతాయని అన్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లోనూ ఈ విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు.
ఛలో యాప్ తో ఉపయోగాలు:
 ప్రయాణికులతో చిల్లర సమస్య ఎదురుకాదు.
 ఆర్టీసీ సిబ్బందికి సమయం ఆదా అవుతుంది.
 నగదు లేకపోయినా కార్డు ద్వారా ప్రయాణం చేయవచ్చు.
 ప్రతిరోజు ప్రయాణం చేసే ఉద్యోగులకు, వ్యాపారులకు ఉపయుక్తంగా ఉంటుంది. 

No comments:

Post a Comment