Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

AP కరోనా పై తూర్పు గోదావరి జిల్లా కలక్టరు వారి సర్క్యలర్

రిఫ్.హెచ్.5/40/2020, తేదీ.18.03.2020
కలక్టరు వారి కార్యాలయము,
తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ
  సర్క్యులర్
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, శ్రీమతి నీలం సాహ్ని వారు ఈ రోజు మధ్యాహ్నం కరోన వైరస్ పై రాష్ట్ర స్థాయి దూర దృశ్యా సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కలక్టర్లకు ఈ క్రింది సూచనలు జారీ చేసియున్నారు.
1. రేపటి నుండి అనగా 19.03.2020వ తేదీ నుండి 31.03.2020వ తేదీ వరకు రాష్ట్రం లో ఉన్న అన్ని విధ్యాసంస్థలకు మరియు కళాశాలలకు సెలవులు ప్రకటించి యున్నారు.
2. ప్రస్తుతము రాష్ట్రములో జరుగుతున్న పరీక్షలు యదావిధిగా జరుపుతూ, పరీక్షకు హాజరయ్యే విధ్యార్ధులను కనీసం 1 మీటర్ దూరంలో కూర్చోబెట్టాలని సూచించారు. రొంప, దగ్గు సూచనలు ఉన్న విధ్యార్ధులను ప్రత్యేక గదులలో కూర్చుండ బెట్టి పరీక్ష వ్రాయించ వలెను!
3. అన్ని ప్రభుత్వ కార్యాలయముల వాష్ రూమ్స్ నందు liquid సానిటైజర్ / సబ్బులు అందుబాటులో ఉంచవలెను.
4. అన్ని ప్రభుత్వ కార్యాలయములలో కంప్యూటర్ డెస్క్టాప్ లు, డోర్ నాబ్ లు మొదలగు వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచవలెను.
5. 1% hypo chloride ద్రావణం లేదా బకెట్ వాటర్ లో 200 gms బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీటితో అన్ని ప్రభుత్వ కార్యాలయములలో శుభ్రం చేయవలెను.
6. రొంప, దగ్గు, షుగర్ మొదలగు వ్యాధులతో బాధపడుచున్న ఉద్యోగులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించవలెను.
7. ప్రజలు సాధ్యమైనంత వరకు దూర ప్రయాణములు వాయిదా వేసుకొనవలెను. తప్పనిసరి పరిస్థితులలో తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేయవలెను.
8.  ఆర్టిసి, ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేట్ రవాణా వ్యవస్థలో ప్రతీ ట్రిప్ ముగిసిన తరువాత వాహనములను శుభ్రం చేయవలెను.
9. సాధ్యమైనంత వరకు వివాహములు మరియు ఇతర వేడుకలు వాయిదా వేసుకోవలెను. తప్పనిసరి అయితే తక్కవ జనాభా తో వేడుకలు జరుపుకోవలెను. ఫంక్షన్ హాల్ నందు కరోన వైరస్ గురించి తెలిపే డిస్ప్లే  లు ఉంచవలెను.
10. జిల్లాలో ఎటువంటి క్రీడలు మరియు సంస్కృతిక కార్యక్రమాలు ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించ కూడదు.
11. జిల్లాలో ఉన్న అన్ని hotels లో పనిచేయుచున్న సప్లయర్స్ మాస్క్ లు ధరించి ఆహార పదార్ధాలను ప్రజలకు సప్లయ్ చేసేలా సంబంధిత యాజమాన్యాలు, మున్సిపల్ కమీషనర్లు మరియు మండల స్థాయి అధికార్లు పర్యవేక్షించాలి.
12. విదేశాల నుండి వచ్చు ప్రయాణీకులు తప్పనిసరిగా 28 రోజులు పాటు హోం isolation పాటించవలెనని అట్లు పాటించని వారిపై ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకొనబడును.
     పై సూచనలను జిల్లా స్థాయి అధికారులు అందరూ విధిగా పాటించవలెను.
సం/-సి.హెచ్. సత్తిబాబు
కలక్టరు తరుపున,
తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ
// అనుమతితో //
పర్యవేక్షకులు
అందరు జిల్లా అధికారులకు
అందరు డివిజనల్ స్థాయి మరియు మండల స్థాయి అధికారులకు.


No comments:

Post a Comment