Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేయదల్చువారు ఈ నియమాలు పాటించాలి

MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేయదల్చువారు ఈ నియమాలు పాటించాలి
త్వరలో జరుగనున్న పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలు ప్రభుత్వ ఎన్నికల సంఘం సిద్ధం చేసింది
● మండల పరిషత్* ప్రాదేశిక నియోజకవర్గానికి (ఎంపీటీసీ) పోటీ చేయాలంటే పోటీచేసే అభ్యర్థి ఆ మండలంలో ఓటరుగా నమోదై ఉండాలి. మండల పరిధిలో ఎక్కడ నుంచైనా పోటీ చేయవచ్చు_
● జడ్పీటీసీగా పోటీ*_ చేయాలంటే జిల్లా పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. అయితే ఒక వ్యక్తి ఒక చోట మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది.
● ఒక వ్యక్తి రెండు చోట్ల పోటీ చేయడానికి వీలులేదు
● అదే విధంగా పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా 21 సంవత్సరాలు నిండి ఉండాలి
● పోటీ చేయదలచిన వారు తమ నామినేషన్ల సెట్లను నాలుగు సెట్లకు మించి దాఖలు చేయడానికి అవకాశం లేదు.
● అంతే కాకుండా గ్రామ సేవకులకు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, డైరెక్టర్లు, ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్లర్లు పోటీ చేసేందుకు అవకాశం లేదు.
● అలాగే లంచాలు, అవినీతి కేసుల అభియోగంలో ఉన్నవారు, విధుల నుంచి తప్పించిన ఉద్యోగులు ఐదేండ్ల కాలపరిమితి వరకు పోటీచేసే అవకాశం లేదు.
● వివిధ నేరాల్లో జైలుశిక్ష అనుభవించిన వారు సైతం శిక్షాకాలం ముగిసిన ఐదేండ్ల తరువాతే పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత పొందుతారు.
● అంతే కాకుండా మానసిక స్థితి సరిగ్గా లేనివారు అనర్హులే.
● అదే విధంగా 1995 మే 31 తరువాత ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్నవారు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు.
● షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన వారు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే తమ కులం, వర్గం తెలియపరిచే ధ్రువపత్రాలపై అర్హులైన గెజిటెడ్ అధికారి చేత సర్టిపై చేయించి తమ నామినేషన్ పత్రంతో పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి.
● అలాగే గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల అభ్యర్థులుగా పోటీ చేయదలచిన వారు ఆయా పార్టీల ధ్రువీకరణ పత్రాలు(బీ ఫారం) తప్పనిసరిగా సమర్పించాలి.
● పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్నికల డిపాజిట్లు ఇలా
● జిల్లా ప్రాదేశిక నియోజకవర్గానికి పోటీచేసే వారు రూ.5వేలు డిపాజిట్‌గా చెల్లించాలి.
● ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వారు రూ.2,500 చెల్లించాలి.
● మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గానికి పోటీ చేసే వారు రూ.2,500 డిపాజిట్‌గా చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ వారైతే రూ.1,250 చెల్లించాలి.
● ఎన్నికల్లో పోటీ చేయదలచిన వారు ఎన్నికల వ్యయ వివరాల నిమిత్తం నామినేషన్ దాఖలు చేసే ముందు బ్యాంకులో ప్రత్యేక ఖాతా తెరిచి అట్టి ఖాతా నెంబర్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రాత పూర్వకంగా సమర్పించాలి.
● ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఇచ్చిన ఖాతా ద్వారానే అభ్యర్థి ఎన్నికల లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది

No comments:

Post a Comment