Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

అమ్మ ఒడి అర్హుల జాబితా పరిశీలన

అమ్మ ఒడి అర్హుల జాబితా పరిశీలన
ప్రొఫార్మా -1 అనగా తల్లి/సంరక్షకులకు రేషన్ కార్డు ఉన్నవారికి

సామాజిక తనిఖీ కొరకు ప్రదర్శింపజేయుట

గ్రామ సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకుడు, మండల విద్యాశాఖాధికారి ద్వారా తనకందిన ప్రొఫార్మా-1 ( తెల్ల రేషను కార్డు వివరాలు కలిగిన తల్లుల మరియు సంరక్షకుల వివరాలతో కూడుకున్న విద్యార్థుల జాబితా)లో ఉన్న సమాచారాన్ని గ్రామ/ వార్డు సచివాలయాల వారీగా జాబితాలను సామాజిక తనిఖీ కొరకై గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర 07.12.2019 లోపు ప్రదర్శింపజేయవలెను.

అభ్యంతరాల స్వీకరణ మరియు తుది జాబితా తయారు

ఈ విధంగా గ్రామ/ వార్డు సచివాలయంలో ప్రదర్శించిన ప్రొఫార్మా-1లో ఉన్న అర్హుల ముసాయిదా జాబితా పై ఫిర్యాదులు, అభ్యంతరాలను 14.12.2019 లోగా సేకరించి ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తూ అర్హత గలిగిన ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ముసాయిదా జాబితాను అప్డేట్ చేస్తూ ఉండాలి.

గ్రామ సభ ఆమోదం

ఈ విధంగా అప్ డేట్ చేసిన ముసాయిదా జాబితాను ..12.2019 నుండి 18.12.2019 మధ్య కాలంలో గ్రామ సభ ఆమోదానికై ప్రవేశపెట్టి సంబంధిత గ్రామసభ ఆమోదాన్ని పొందాలి.

ప్రొఫార్మా -2 అనగా తల్లి/సంరక్షకులకు రేషన్ కార్డు లేని వారికి

క్షేత్రస్థాయి పరిశీలన

గ్రామ సచివాలయ విద్యా, సంక్షణ సహాయకుడు, మండల విద్యాశాఖాధికారి ద్వారా తనకందిన ప్రొఫార్మా-2 (తెల్ల రేషను కార్డు వివరాలు లేని అలల మరియు సంరక్షకుల వివరాలతో కూడుకున్న విద్యార్థుల జాబితా.) జాబితాలను సంబంధిత గ్రామ, వార్డు వాలంటీర్లకు అందచేయాలి. ఈ సమాచారాన్ని గ్రామ/ వార్డు వాలంటీర్లు వారి పరిధిలోని ఆయా కుటుంబాలకు వివరించి తద్వారా ఆ సమాచారంలో లేని వివరాలు అనగా తల్లుల పేర్లు, తెల్ల రేషను కార్డు వివరాలు, ఆధార్ నెంబరు, బాంకు అకౌంటు నెంబరు, ఐఎఫ్ఎస్ సీ కోడు నెంబరు మొదలైన వివరాలను సేకరించాలి. ఆ సమాచారంలో తెల్ల రేషను కార్డు లేని కుటుంబాల విషయంలో వారు నిరుపేద | అర్హత కలిగిన కుటుంబాలకు చెందిన వారు అవునో కాదో 'జగనన్న విద్యా దీవెన' పథకంలో ఉన్న ఆరు అంచెల పరిశీలన (సిక్స్ స్టెప్ వాలిడేషన్) ద్వారా ధృవీకరించుకోవాలి. ఈ కార్యక్రమమంతా 08.12.2019 లోపు పూర్తి చేయాలి.

ఆ విధంగా గ్రామ/ వార్డు వాలంటీర్లు క్షేత్రస్థాయిలో ప్రొఫార్మా-2లో నమోదు చేసి ధృవీకరించిన సమాచారం ఉన్న 'హార్డ్ కాపీ'లను సంబంధిత విద్యా, సంక్షేమ సహాయకుడికి అందజేయవలెను. అతను ఆ సమాచారాన్ని తమ మండల విద్యాశాఖాధికారికి నేరుగా అందచేయవలెను.

సామాజిక తనిఖీ కొరకు ప్రదర్శింపజేయుట

ఈ విధంగా ప్రొఫార్మా-2లో ధృవీకరించిన సమాచార హార్డు కాపీలను అనుసరించి సవరించిన/ నమోదు చేసిన సమాచారాన్ని మండల విద్యాశాఖాధికారి వారు తమ లాగిన్లలో అప్ డేట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అప్ డేట్ చేసిన సమాచారాన్ని గ్రామాల వారీగా అర్హులైన తల్లుల/ సంరక్షకుల ముసాయిదా జాబితాను తయారు చేసి సంబంధిత గ్రామ /వార్డు సచివాలయంలో 11.12.2019 నాటికి సంబంధిత గ్రామ వార్డు సంక్షేమ, విద్యా సహాయకుని ద్వారా సామాజిక తనిఖీకై ప్రదర్శింపజేయాలి.

అభ్యంతరాల స్వీకరణ మరియు తుది జాబితా తయారు

ఈ విధంగా గ్రామ, వార్డు సచివాలయంలో ప్రదర్శించిన అర్హుల ముసాయిదా జాబితాపై ఫిర్యాదులు, అభ్యంతరాలను 14.12.2019 లోగా సేకరించి ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తూ అర్హత గలిగిన ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ముసాయిదా జాబితాను అప్డేట్ చేస్తూ ఉండాలి.

 గ్రామ సభ ఆమోదం

ఈ విధంగా అప్ డేట్ చేసిన ముసాయిదా జాబితాను 15.12.2019 నుండి 18.12.2019 మధ్య కాలంలో గ్రామ సభ ఆమోదానికై ప్రవేశపెట్టి సంబంధిత గ్రామసభ ఆమోదాన్ని పొందాలి.  ఈ విధంగా గ్రామ సభ ఆమోదం పొందిన తుది జాబితాలను ప్రతి మండల విద్యాశాఖాధికారి 22.12 2019 లోపు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి ఆమోదానికై పంపాలి. ప్రతి జిల్లా విద్యాశాఖాధికారి తమకు మండల విద్యాశాఖాధికారుల ద్వారా అందిన జాబితాలను ఎప్పటికప్పుడు పరిశీలించి ఆమోదించాలి. ఈ విధంగా జిల్లాలోని అందరు మండల విద్యాశాఖాధికారుల నుండి వచ్చిన జాబితాలను ఆమోదించిన పిదప సదరు మొత్తం జాబితాలను జిల్లా కలెక్టర్ వారి ఆమోదానికి 24.12.2019న సమర్పించాలి.

నిధుల విడుదల

 మండల విద్యాశాఖాధికారులకు ఈ కార్యక్రమ నిర్వహణ ఖర్చుల నిమిత్తం గరిష్ఠంగా రూ. 5000/- జిల్లా విద్యాశాఖాధికారికి సమగ్ర శిక్షా డి.పి.ఓ పను నుండి తక్షణమే విడుదల చేయాలని ఆదేశించడమైనది.
 తదుపరి కార్యాచరణ ప్రణాళికపై ఉత్తర్వులు తదుపరి కార్యావర్తనముల ద్వారా తెలియజేయబడతాయి.
----------------------------------------------------------------------------------
మండల విద్యాశాఖ అధికారులు, అన్ని యాజమాన్యాల  ప్రధానోపాధ్యాయులు కొరకు సూచనలు:
➧మండల విద్యాశాఖ అధికారి లాగిన్ లో ప్రింట్ ఆప్షన్ అందుబాటులో ఉంది
➧మండల విద్యాశాఖ అధికారులు మీయొక్క లాగిన్ నుండి పంచాయతీల వారీగా ఫారం-1 print తీయగలరు
➧మండల విద్యాశాఖ అధికారి తమ మండల అభివృద్ధి అధికారి, తహసీల్దార్ మరియు  గ్రామ/ వార్డు సంక్షేమ విద్యా   సహాయకుల  సమన్వయ సమావేశం నిర్వహించి తల్లి/ సంరక్షకుల వివరాలు పంపిణీ చేయవలెను. పంపబడిన   ప్రింట్ ను కార్యదర్శి సచివాలయం వద్ద డిస్ప్లే చేయవలెను ( social audit)
➧డిస్ప్లే చేయబడిన ప్రింట్ లో మార్పులు కార్యదర్శి , గ్రామ వాలంటీర్ సహాయంతో చేయవలెను.
➧Form -1 గ్రామ సచివాలయం వద్ద డిస్ప్లే చేసిన తర్వాత అభ్యంతరాలను 14.12.19 వరకు సేకరించి ముసాయిదా జాబితాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి
➧15.12.19 - 18.12.19 మధ్యకాలంలో గ్రామ సభ ఆమోదానికి ప్రవేశపెట్టి  గ్రామ సభ ఆమోదం పొందాలి
➧Form-2  లో ఉన్న తల్లి / సంరక్షకుల వివరాలు  గ్రామ వాలంటీర్లు సేకరించాలి. మరియు ఆ కుటుంబాలు అర్హత కలిగినవారో, కాదో *జగనన్న విద్యా దీవెన* పధకంలో ఉన్న ఆరంచెల పరిశీలన ద్వారా ధృవీకరించు కోవాలి .తదుపరి ఆ వివరాలు సంబంధిత విద్యా సంక్షేమ సహాయకులు ద్వారా మండల విద్యాశాఖ అధికారి అందజేయగలరు
       ➧పేరెంట్ తల్లి /సంరక్షకుల వివరాల్లో మార్పులు ఉన్నచో వారి యొక్క సంతకం తీసుకోవలెను
      మార్పులు లేనిచో సంతకం అవసరం లేదు
      ➧ఫారం-2  / ఫారం- 1 (వార్డు) కొద్ది సమయం తర్వాత అందుబాటులోకి రానున్నది
      ➧ ప్రధానోపాధ్యాయులు  సదరు ప్రింటును పరిశీలించవలెను
      ➧మార్పులు పూర్తి అయిన పిదప మండల విద్యాశాఖ అధికారి  యొక్క లాగిన్ లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వబడుతుంది.
-----------------------------------------------------------------------


Download Daily SCHEDULE 

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND