Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

రైతు భరోసాకు సంబంధించి సర్కార్ కీలక సవరణలు

రైతు భరోసాకు సంబంధించి  సర్కార్ కీలక సవరణలు

వైఎస్సార్‌ రైతు భరోసాకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్న  సర్కార్. పథకంలో చిన్న, చిన్న సవరణలు.. కౌలు రైతులకు సంబంధించి జీవో జారీ చేసిన ప్రభుత్వం.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ రైతు భరోసాకు సంబంధించి కొన్ని సవరణలు చేసింది. ఈ పథకానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్యెల్యేలు, ఎంఎల్సీలు, మాజీలను ఈ అనర్హులుగా ప్రకటించింది. రైతు కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్థులు, టాక్స్ కట్టేవారు ఉన్నా.. పథకానికి రైతు అర్హుడని, అర్హులైన రైతు మరణిస్తే చట్ట ప్రకారం కుటుంబంలోని అర్హులకు ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాతి ఏడాది ఆ భూమి వెబ్‌ల్యాండ్‌లో ఎవరి పేరుమీద ఉంటే వారికి రైతు భరోసా ఇచ్చేలా మార్పులు చేస్తూ జీవో జారీ చేసింది.

ఇటు కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేస్తూ జీవో జారీ చేసింది. అటవీ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రైతులకు సైతం రైతు భరోసాను వర్తింపజేసింది. అలాగే వైఎస్సార్‌ రైతు భరోసాకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించేందుకు గడువును రెండు వారాల క్రితమే పెంచింది . డిసెంబర్ 15 వరకు దరఖాస్తుకు అవకాంశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా కౌలురైతులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా గడువు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది.

➧ website--  https://ysrrythubharosa.ap.gov.in/


➽Know Your Payment Status--https://ysrrythubharosa.ap.gov.in/RBApp/Reports/PaymentStatus


➧Download Circular-1

➧Download Circular-2

No comments:

Post a Comment