Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఆధార్ కార్డు ఉందా? ఈ తప్పు చేస్తే రూ.10,000 జరిమానా..!

ఆధార్ కార్డు ఉందా? ఈ తప్పు చేస్తే రూ.10,000 జరిమానా..!

ఆధార్ కార్డు ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరికీ ఉండే ఉంటుంది. ఆధార్ కార్డు కలిగిన వారు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేందుకు ఐటీఆర్ సమయంలో పాన్ నెంబర్ లేకపోతే ఆధార్ నెంబర్ ఇచ్చే వెసులుబాటు కల్పించింది. అయితే ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. మీర ఇచ్చే ఆధార్ నెంబర్ తప్పు అయితే మీకు రూ.10 వేల జరిమానా పడొచ్చు.

ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం 1961కు సవరణలు చేశారు. దీంతో పాన్ నెంబర్‌కు బదులు ఆధార్ నెంబర్ ఇవ్వడంతోపాటు ఆధార్ నెంబర్ తప్పు చెబితే రూ.10,000 పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. సాధారణంగా పాన్ నెంబర్ తప్పుగా చెబితే లేదంటే ఒకటి కన్నా ఎక్కువ పాన్ నెంబర్లు కలిగి ఉంటే రూ.10 వేల జరిమానా ఉంటుంది.

ఐటీఆర్ దాఖలు సమయంలో ఆధార్ నెంబర్ తప్పుగా ఇవ్వడం మాత్రమే కాకుండా పాన్ కచ్చితంగా ఇవ్వాల్సిన స్థానాలలో ఆధార్ ఇచ్చినప్పుడు కూడా ఈ పెనాల్టీ రూల్స్ వర్తిస్తాయి. అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, డీమ్యాట్ అకౌంట్ తెరవడం, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టెమెంట్, రూ.50 వేలకు పైన లావాదేవీలకు పాన్ బదులు ఆధార్ ఇచ్చినప్పుడు, ఆ ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే అప్పుడు రూ.10 వేల పెనాల్టీ పడుతుంది.

గతంలో జరిమానా కేవలం పాన్ నెంబర్‌కు మాత్రమే పరిమితం అయ్యింది. అయితే ఆధార్, పాన్ ఇంటర్‌ఛేంజబిలిటీ అమలులోకి రావడంతో ఇప్పుడు ఈ రూ.10 వేల ఫైన్ ఆధార్ కార్డుకు కూడా వర్తిస్తుంది.

మీరు ఎన్ని సార్లు ఆధార్ నెంబర్ తప్పుగా ఇస్తారో అన్ని సార్లూ ఫైన్ పడుతుంది. అంటే ఆధార్ నెంబర్ రెండు ఫామ్స్‌లో తప్పుగా వేస్తే.. అప్పుడు రూ.20,000 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఇకపోతే యూఐడీఏఐ కాకుండా ఈ జరిమానాను ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ విధిస్తుంది. 

No comments:

Post a Comment