Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

సర్వ’శిక్ష పేరు.. ఇక ‘సమగ్ర’ శిక్షా!

సర్వ’శిక్ష పేరు.. ఇక ‘సమగ్ర’ శిక్షా!
సమూల మార్పులకు సర్కారు శ్రీకారం
ఒకే గొడుగు కిందకు ఎస్‌ఎస్‌ఏ, ఆర్‌ఎంఎస్‌ఏ, ఉపాధ్యాయ విద్య
డీఈఓలకే పూర్తి అధికారం.. తక్షణమే అమలులోకి..
                 సర్వశిక్షా అభియాన్‌(ఎ్‌సఎ్‌సఏ)లో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సర్వశిక్షా అభియాన్‌ పేరు.. ఇకపై సమగ్ర(కాంప్రహెన్సివ్‌) శిక్షా అభియాన్‌(సీఎ్‌సఏ)గా మారుతోంది. ప్రస్తుతం ఎస్‌ఎ్‌సఏ, ఆర్‌ఎంఎ్‌సఏ, ఉపాధ్యాయ విద్య వేర్వేరుగా ఉండగా, ఇక అవన్నీ ఒకే గొడుగు కిందకు రానున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టు ఆఫీసర్ల పోస్టులు రద్దు చేసింది. ఎక్స్‌ అఫిషియో జిల్లా ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌గా జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ)ని నియమించనుంది. పీవో పోస్టును అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌(ఏపీసీ)గా మార్చింది. దీంతో విద్యా కార్యక్రమాలన్నింటిపై డీఈఓలకు పూర్తిస్థాయి అధికారాలను అప్పగించినట్లయ్యింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్‌ఎ్‌సఏ పీవోలుగా ఇప్పటి వరకు పంచాయతీరాజ్‌, పోలీసు, రెవెన్యూ, జైళ్ల శాఖలతో పాటు ఎయిడెడ్‌ కళాశాల లెక్చరర్లు పని చేస్తున్నారు. వీరిలో బీఈడీ విద్యార్హతలు లేనివారు కూడా ఉన్నారు. అలాంటివారు ఏదైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకోవడం విద్యాశాఖకు ఇబ్బందికరంగా మారింది. కొన్ని కార్యక్రమాలు విద్యాశాఖ, ఎస్‌ఎ్‌సఏ సమాంతరంగా నిర్వహిస్తుండటంతో సమస్యలు ఉత్ఫన్నమవుతున్నాయి
       వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఎస్‌ఎ్‌సఏను పునర్వ్యవస్థీకరించి జిల్లా స్థాయిలో అన్ని కార్యక్రమాలను విద్యాశాఖ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీసీలుగా పాఠశాల విద్యాశాఖలోని ఉప విద్యాధికారులు, బీఈడీ విద్యార్హతలు ఉన్న అసిస్టెంట్‌ డైరెక్టర్లు, గ్రేడ్‌-1 హెడ్మాస్టర్లను నియమించనున్నారు. విద్యాశాఖాధికారులు అందుబాటులో లేకపోతే ఉప విద్యాధికారి అర్హత, బీఈడీ విద్యార్హతలు ఉన్న బీసీ, గిరిజన సంక్షేమాధికారులను నియమించనున్నారు. ఏపీసీల నియామకానికి రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, పాఠశాల విద్యా కమిషనర్‌ కన్వీనర్‌గా, ఎస్‌ఎ్‌సఏ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ సభ్యులుగా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సిఫారసు మేరకే ప్రభుత్వం ఏపీసీ లుగా నియమిస్తుంది. ఈ మార్పులను వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలిచ్చారు.

No comments:

Post a Comment