మధ్యాహ్నభోజనం మరింత పౌష్టికం
అంగన్వాడీ కేంద్రాల్లో అందరికీ పౌష్టికాహారం
ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశం
పాఠశాలల మధ్యాహ్నభోజనంలో పిల్లలకు ప్రత్యేక పౌష్టికాహారం ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మధ్యాహ్నభోజనంపై గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచడంపై దృష్టిపెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా గోధుమలు, బెల్లంతో తయారు చేసిన ఆహారపదార్థాలు, వేరుసెనగ ఉండలు లాంటివి అల్పాహారంగా అందిస్తే బాగుంటుందని అధికారులు సూచించారు. వీటిపై ప్రతిపాదనలు సిద్ధం చేసుకురావాలని సీఎం చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో మరో 65 కేంద్రీయ వంటశాలల ఏర్పాటుపైనా వివరాలు అడిగి తెలుసుకున్నారు._
వచ్చేనెల నుంచి పాఠశాలల పనులు
పాఠశాలల్లో కల్పించనున్న మౌలికవసతుల పనులను నవంబరు నుంచి ప్రారంభించి, మార్చినాటికి పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. మొదటిదశలో 15వేల పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు. మౌలికసదుపాయాలు, పరికరాలు అన్నీ నాణ్యంగా ఉండాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. సౌకర్యాల కల్పనలో ఏ ఇతర బడులకు తీసిపోకూడదని, వ్యయం ఎక్కువైనా సౌకర్యాల కల్పనలో రాజీపడొద్దని సూచించారు. వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి ఏకరూపదుస్తులు, పుస్తకాలను అందించాలని సీఎం ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో అందరికీ నువ్వుల ఉండలు*
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న లబ్ధిదారులందరికీ ప్రత్యేక పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రక్తహీనత ఉన్న గర్భిణిలు, బాలింతలు, వయసుకు తగ్గ ఎత్తు లేని పిల్లలకు మాత్రమే కాకుండా లబ్ధిదారులందరికీ నువ్వుల ఉండలు, బెల్లం, వేరుసెనగ అచ్చులు, రాగిపిండి తదితరాలను ఇచ్చేందుకు అయ్యే ఖర్చుపై నివేదిక అందించాలని సూచించారు. గోధుమ పిండితో అన్నవరం ప్రసాదం తరహాలో పదార్ధం ఇచ్చే విషయాన్ని ఆలోచించాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్ఠికాహారం పంపిణీపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కేంద్రాల్లో నెలలో 25 రోజులపాటు ఇస్తున్న కోడిగుడ్లను 30 రోజులకు పెంచితే అయ్యే ఖర్చుపై నివేదిక అందించాలని సూచించారు. కేంద్రాల్లో లబ్ధిదారులకు వండి అందిస్తున్న పౌష్ఠికాహారాన్ని వస్తురూపేణా ఇంటింటికి అందించడం, నగదు బదిలీ చేయడంపై చర్చించారు. ఒక్కో జిల్లాలో కోడిగుడ్ల ధరలు ఒక్కో విధంగా ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా ఒకే ధర ఉండటంతోపాటు ప్రస్తుతం కంటే తక్కువకే అందేలా విధానాన్ని రూపొందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందే సేవలు మరింత సమర్థవంతగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వృద్ధుల కోసం రాష్ట్రస్థాయి సీనియర్ సిటిజన్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

No comments:
Post a Comment