పదో తరగతి పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ..వివరాలు
పదో తరగతి పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రశ్న పత్రాల్లో 20 శాతం ఉన్న ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులను రద్దు చేసింది.
గురువారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షల్లో వినూత్న మార్పులు తీసుకొస్తున్నాం.
పదో తరగతి ప్రశ్న పత్రాల్లో 20 శాతం ఉన్న ఇంటర్నల్ అసెమెంట్ మార్కులను తొలగించాము.
గతంలో 20 మార్కులను కార్పొరేట్ కాలేజీల కోసం ఏర్పాటు చేశారు. అందుకే ఇప్పుడు రద్దు చేశాం.
బిట్ పేపర్స్ కూడా ప్రశ్న పత్రంలో అంతర్భాగం చేసేసాం.
ప్రశ్న పత్రాల్లో సబ్జెక్టుల వారీగా పాస్ మార్కులు ఇస్తాం.
2.30 గంటల పరీక్షకు అదనంగా 15 నిమిషాలు ప్రశ్నపత్రం చదువుకోవడం కోసం కేటాయిస్తున్నాం.
మార్కుల షీట్ ని కూడా నాణ్యంగా తయారుచేస్తాం.
పదో తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తాం.
టెన్త్‌లో ఇంటర్నల్ మార్కులు రద్దు
విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి
పదోతరగతి ప్రశ్నాపత్రంలో ఇక కీలక మార్పులు
ప్రత్యేకంగా ఇచ్చే బిట్ పేపర్ తొలగింపు
ప్రశ్నాపత్రంలో అంతర్భాగంగానే బిట్ పేపర్
పేపర్–1లో 50.. పేపర్–2లో 50 మార్కులు
సమాధాన పత్రంగా 18 పేజీల బుక్‌లెట్
విద్యార్థుల విజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నాపత్రం
పదోతరగతి ప్రశ్నాపత్రంలో కీలక మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
పదోతరగతిలో 20 శాతం ఇంటర్నల్ మార్కులను రద్దు చేయనున్నామని చెప్పారు.
ఇంటర్నల్ మార్కుల వల్ల కార్పొరేట్ స్కూళ్లకే లబ్ధి కలుగుతోందనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. అందుకే మొత్తం మార్కులకు పదోతరగతి పరీక్ష నిర్వహిస్తామని, పరీక్షలో ప్రత్యేకంగా ఇచ్చే బిట్ పేపర్ తొలగిస్తామని వెల్లడించారు.
ఇకపై బిట్ పేపర్‌ను ప్రశ్నాపత్రంలో అంతర్భాగంగా చేరుస్తామని వివరించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
‘‘టెన్త్‌లో పేపర్–1లో 50 మార్కులు, పేపర్–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ప్రశ్నలు ఇస్తారు.
ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి. షార్ట్ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.
సింపుల్ ఆన్సర్ ప్రశ్నలు 8 మొత్తం 8 మార్కులకు ఉంటాయి.
వెరీ సింపుల్ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి.
సబ్జెక్ట్ వారీగా జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తాం.
ఒక్కో సబ్జెక్ట్‌లో రెండు పేపర్‌లలో వచ్చిన మార్కులను కలిపి పాస్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటాం.
పరీక్ష సమయం 2.30 గంటలు ఉంటుంది.
దీనికి అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు, సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం ఇస్తాం.
సమాధాన పత్రాలు గతంలో లూజ్ షీట్లు ఉండేవి.
దానివల్ల కాపీయింగ్‌కు ఆస్కారం ఉండేది.
అందుకే ఇప్పుడు 18 పేజీల బుక్‌లెట్ ఇవ్వబోతున్నాం.
విద్యార్థుల్లోని విజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తాం. మూల్యాంకనం పకడ్బందీగా నిర్వహిస్తాం. కంప్యూటర్ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగిస్తాం.
దీనికి పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు’’ అని మంత్రి సురేష్ అన్నారు.
కొత్త ప్రశ్నాపత్రం ఇలా..
►1వ విభాగంలో వెరీ షార్ట్ ఆన్సర్స్: 12 ప్రశ్నలు.
►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు.
►2వ విభాగంలో సింపుల్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.
►1 మార్కు చొప్పున 8 మార్కులు.
►3వ విభాగంలో షార్ట్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.
►2 మార్కులు చొప్పున 16 మార్కులు.
►4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్: 5 ప్రశ్నలు.
►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు.

No comments:
Post a Comment