Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఏపీలో ఐదు దశల్లో ‘కంటి వెలుగు’ ఏపీలో ఐదు దశల్లో ‘కంటి వెలుగు’

ఏపీలో ఐదు దశల్లో ‘కంటి వెలుగు’
ఏపీలో ఐదు దశల్లో ‘కంటి వెలుగు’

 ఏపీ అక్టోబర్‌ 10వ తేదీ నుంచి వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యద‌ర్శి కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కంటి వెలుగు ప‌థకాన్ని 5 ద‌శ‌ల్లో అమ‌లు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప‌థకం ప‌ర్యవేక్షణ‌కు జిల్లా కలెక్టర్లు ఛైర్మన్‌గా టాస్క్‌ఫోర్స్‌ క‌మిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రికీ కంటి ప‌రీక్షలు నిర్వహించేలా కార్యాచరణ చేపట్టాలని జీవోలో పేర్కొన్నారు. మొద‌టి రెండు ద‌శ‌ల్లో పాఠశాల విద్యార్థులకు కంటి ప‌రీక్షలు నిర్వహించనున్నారు. మిగిలిన విడ‌త‌ల్లో క‌మ్యూనిటీ బేస్ ప‌ద్ధతిలో పరీక్షలు చేయ‌నున్నారు. కంటి వెలుగు ప‌థకం అమ‌లుకు కావాల్సిన సామగ్రి, పరికరాలు, ఔషధాలను సిద్ధం చేసుకోవాల‌ని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


No comments:

Post a Comment