Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఇగ్నోలో ఎంబీఏ, బీఈడీల ప్రవేశాలకు దరఖాస్తులు

 ఇగ్నోలో ఎంబీఏ, బీఈడీల ప్రవేశాలకు దరఖాస్తులు


            ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) జనవరి 2020  నుండి ప్రారంభమయ్యే ఎంబీఏ , బిఈడి కోర్సులలో ప్రవేశాలకు ప్రకటన జారీ చేసింది. జనవరి 2020 సెషన్లో  ప్రారంభమయ్యే ఈ కోర్సుల ప్రవేశ పరీక్ష 27 జూలై 2019 న దేశంలోని వివిధ పట్టణాలలో, నగరాలలో జరుగుతుంది. నేషనల్, టెస్టింగ్, ఏజెన్సీ (ఎన్ఏటీ) ద్వారా నిర్వహించబడే ఈ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్లో ప్రారంభమయింది. ప్రవేశ పరీక్షలు రాయగోరే విద్యార్థులు  https://ntaignod.nic.in ద్వారా ధరఖాస్తుల్ని నింపి సంబంధిత ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూలై 1, 2019. ఆన్లైన్, దరఖాస్తులకి సంబంధించిన లింకులు, కోర్సుల అర్హతలు, ఇతర వివరాలు ఇగ్నో వెబ్ సైట్ హెూమ్ పేజిలో ఇవ్వబడ్డాయి. ఇగ్నో విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం పరిధిలో ఆసక్తి గల అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, చివర తేదీకి ముందుగానే ధరఖాస్తుల్ని సమర్పించాలని విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తు స్వీకరణకు జూలై 1 వరకు స్వీకరణ, జూలై 27న ప్రవేశ పరీక్షలు నిర్వహించనుంది. ఎంబీఏ, బిఇడి కోర్సులకి సంబంధించిన అర్హతలు, ఇతర వివరాలు ఇగ్నో వెబ్ సైట్ ద్వారాగానీ, ఎంవిపి కాలనీ లోని ఇగ్నో ప్రాంతీయ కేంద్ర కార్యాలయాన్ని 0891-2511200, 300 ఫోన్ నంబర్స్ ద్వారా సంప్రదించి తెలుసుకోవచ్చని ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ఎస్. రాజారావు తెలిపారు.

No comments:

Post a Comment