Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

బెస్ట్‌ అవైలబుల్‌ ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈ నెల 31 వరకు పెంపు


బెస్ట్‌ అవైలబుల్‌ ప్రవేశానికి దరఖాస్తు గడువు పెంపు


స్ట్‌అవైలబుల్స్‌ స్కూళ్లలో ప్రవేశానికి షెడ్యూల్డు కులాల విద్యార్థుల నుంచి దరఖాస్తుల గడువు తేదీని పెంచినట్టు సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ ఒక ప్రకటనలో తెలిపారు. 2019-20 విద్యాసంవత్సరానికి ప్రవేశం పొందడానికి జన్మభూమి వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వాస్తవానికి దరఖాస్తు చేసుకోవ డానికి ఈనెల 25వరకు మాత్రమే గడువు ఇచ్చామని, ఆ తేదీని ఈనెల 31 వరకు పెంచామన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అడ్మిషన్లు లాటరీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. దరఖాస్తుతో పాటు కుల ధ్రువీకరణ పత్రం, జనన ధ్రువీకరణ పత్రం, ఆధాయ ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రాలతో వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల న్నారు. 5వ తరగతిలో ప్రవేశం పొందడానికి జూన్‌ 7వ తేదీన ఎంట్రన్స్‌ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ఉంటుందన్నారు. ఇంగ్లీషు మీడియంలో తెలుగు మీడియంలో రాయవచ్చన్నారు. జన్మభూమి వెబ్‌సైట్‌ నుండి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు.